Kumbh melaపై తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు.. సీఎం వార్నింగ్

మహా కుంభమేళాపై తప్పుడు ప్రచారాలు చేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి హెచ్చరించారు. చలి తీవ్రతకు 11 మంది చనిపోయారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే దుప్పట్లు కూడా సీఎం యోగి పంపిణీ చేశారు.

New Update
Up cm yogi aditya nath

Up cm yogi aditya nath Photograph: (Up cm yogi aditya nath)

ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌‌లో మహా కుంభమేళా జరుగుతోంది. పవిత స్నానం ఆచరించడానికి కోట్ల మంది భక్తులు వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు దుండగులు కుంభమేళాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీరిపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.

ఇది కూడా చూడండి: Saif Ali khan: సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే

11 మంది చనిపోయారని తప్పుడు ప్రచారం..

కుంభమేళాలో చలి తీవ్రతను తట్టుకోలేక 11 మంది మరణించారని, ఇంకా కొందరు ఆసుపత్రి పాలయ్యారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. కుంభమేళాకి వచ్చిన భక్తులు ఆసుపత్రి పాలయైన కూడా కనీసం అధికారులు పట్టించుకోలేదని ప్రచారం చేసిన లలూ యాదవ్‌ సంజీవ్‌ను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన కార్యకర్తగా చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

ఇది కూడా చూడండి: Manchu Manoj: చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్

ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. ఎవరైనా కూడా కుంభమేళాపై తప్పుడు ప్రచారం చేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుంభమేళాలో ఎవరైనా అశాంతికి పాల్పడితే ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కుంభమేళా ప్రాంతంలో వైద్య శిబిరాలను 24 గంటలు కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే కొందరికి దుప్పట్లు కూడా పంపిణీ చేశారు. 

ఇది కూడా చూడండి: Alcohol: ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే క్యాన్సర్‌లు..డేంజర్‌లో మీ ఆరోగ్యం

ఇది కూడా చూడండి:  Kareena Kapoor: భర్త పై దాడి.. స్పందించిన కరీనా కపూర్, ఏం చెప్పారంటే?

Advertisment
తాజా కథనాలు