AP News: విద్య నేర్పకుండా వెట్టి చాకిరీ.. ఉపాధ్యాయుడి నిర్వాకం
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ఓ ఉపాధ్యాయుడు కూలి పని చేయించాడు. ఒక సామాజిక వర్గానికి చెందిన కమ్యూనిటీ హల్ భవనంపై పనులు చేయించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.