Ts Crime: భర్తను చంపితే 15 లక్షలు, అడ్వాన్స్ 2 లక్షలు.. భార్య షాకింగ్ ఆఫర్!
కామారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. వివాహిత రేణుక ప్రియుడి కోసం భర్తను చంపేందుకు 15 లక్షల సుపారీ ఇచ్చింది. అదృష్టవశాత్తు భర్త కుమార్ గాయాలతో తప్పించుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విషయం తెలుసుకున్న పోలీసులు భార్యతో సహా ఇతర నిందితులను అరెస్టు చేశారు.