సైబర్ నేరాలు అరికట్టేందుకు కీలక ప్రాజెక్టు ప్రారంభించిన పోలీసులు
సైబర్ నేరాలను నివారించేందుకు సైబరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. PROTECT (ప్రొటెక్ట్) అనే పేరుతో సరికొత్త ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టును సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్లు మంగళవారం ప్రారంభించారు.