TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

హుస్నాబాద్‌ సాయి ప్రకాష్ మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. కానిస్టేబుల్ శ్రీనివాసరావుతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రకాష్‌ పిన్ని నిర్మల.. అలా చేయొద్దని చెప్పినందుకు సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

New Update
tg crime

Husnabad Sai Prakash murder case

TG Crime: హుస్నాబాద్‌ సాయి ప్రకాష్ మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. కానిస్టేబుల్ శ్రీనివాసరావుతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రకాష్‌ పిన్ని నిర్మల వొద్దని చెప్పినందుకు సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?

కిడ్నాప్ చేయించి హత్య..

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ కు చెందిన వివాహిత నిర్మల కొంతకాలంగా కానిస్టేబుల్ శ్రీనివాసరావుతో అక్రమ సంబంధం నడిపిస్తోంది. ఈ క్రమంలోనే నిర్మల బావ కొడుకు సాయి ప్రకాశ్ ఈ విషయాన్ని గుర్తించి హెచ్చరించాడు. దీంతో నిర్మల, శ్రీనివాసరావు.. సాయిపై కక్ష పెంచుకున్నారు. ఏప్రిల్ 15 అర్ధరాత్రి కిడ్నాప్ చేయించి, సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించారు. హుస్నాబాద్‌లోని ఓ బావిలో సాయిప్రకాష్‌ డెడ్‌బాడీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

అయితే అంతకుముందు విషయం తెలియగానే నిర్మలపై వెంకటాపురం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుంటానని నిర్మల బెదిరింపులకు పాల్పడింది. తలుపులు బద్దలుకొట్టి నిర్మలను బయటకు తీసుకొచ్చిన గ్రామస్తులు చెప్పులతో కొడుతూ, రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. 

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

ఇక సాయి ప్రకాష్‌ది ములుగు జిల్లా వెంకటాపూర్. అతను స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సామాజిక సేవకార్యక్రమాలు చేస్తున్నాడు. అయితే గతంలోనూ పిన్ని నిర్మలకు, కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు అక్రమ సంబంధం ఆధారాలు చూపించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కానిస్టేబుల్‌ శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. ఆ కోపంతోనే రగిలిపోతున్న వారిద్దరూ ఈ దారుణానికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ శ్రీనివాస్‌తో పాటు ముగ్గురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు హనుమకొండ పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు సాయిప్రకాష్‌ ఫోన్‌ను కాజీపేట నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో పడేసినట్లు గుర్తించారు. 

Also Read :  ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !

 illegal-relationship | murder | telugu-news | today telugu news

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు