/rtv/media/media_files/2025/07/16/warangal-2025-07-16-11-05-30.jpg)
TG Crime
TG Crime: అక్రమసంబంధాల మోజులో కట్టుకున్న భర్తలను ఏ మాత్రం ఆలోచించకుండా కడతేర్చుతున్నారు భార్యలు. తాజాగా తెలంగాణలో మరో దారుణం జరిగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బావపై ప్రేమతో కట్టుకున్న భర్తకు విషం పెట్టి చంపేసిందో భార్య. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించి మరి లేపేసింది. ఎస్సై చందర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన బాలాజీ వ్యవసాయ కూలీ. అతడికి భార్య కాంతి, కూతురు స్వప్న, కుమారుడు ప్రవీణ్ ఉన్నారు.
Also Read: నిమిషను క్షమించేది లేదు, ఉరిశిక్ష పడాల్సిందే.. బాధిత కుటుంబం సంచలనం
గొంతులోంచి నొప్పి వస్తోందంటూ
అయితే ఈ నెల 08వ తేదీ సాయంత్రం మద్యం తాగడానికి బయటకు వెళ్తుండగా అతని భార్య కాంతి పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్‌ను ఇచ్చింది. అది తాగిన బాలాజీ కొద్దిసేపటికే గొంతులోంచి నొప్పి వస్తోందంటూ కిందపడిపోయాడు. అలాంటి స్థితిలోనే భర్తను అలాగే వదిలేసి కాంతి దగ్గర్లోని తాళ్లకుంటతండాలో ఉంటున్న అక్క- బావ ఇంటికి వెళ్లింది.
Also Read: జూలై 21 నుంచి వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ఇవే
అయితే పొరిగింటివారు బాలాజీని గుర్తించి వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతున్న బాలాజీ ఆరోగ్యం మరింత విషమించడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జులై15న మృతి చెందాడు. బావతో అక్రమ సంబంధం కారణంగానే తన కొడుకును కాంతి చంపేసిందని మృతుడి తండ్రి హరిచందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: భారత్ పై 'నాన్ వెజ్' పాల కుట్ర.. ట్రంప్ ప్లాన్ ను తిప్పికొట్టిన భారత్!