IND-US Trade: భారత్ పై 'నాన్ వెజ్' పాల కుట్ర.. ట్రంప్ ప్లాన్ ను తిప్పికొట్టిన భారత్!

అమెరికా, భారత్ ల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు అయిపోయిందని తెలుస్తోంది. వారం, పది రోజుల్లో సంతకాలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే యూఎస్ నాన్ వెజ్ పాడి ఉత్పత్తులకు మాత్రం భారత్ చాలా గట్టిగా నో చెప్పిందని సమాచారం.

New Update
usa

Pm Narendra Modi, President Trump

మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలతో విరుచుకుపడ్డానికి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ సిద్ధమైంది. దీనికి సంబంధించి రెండు దేశాల మధ్యనా చాలా రోజుల నుంచి సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఒక కొలిక్కి వచ్చాయని త్వరలోనే డీల్ ను ప్రకటిస్తారని తెలుస్తోంది.  చాలా వరకు భారత్ ఉత్పత్తులపై 10 శాతం సుంకాలను విధించడానికి అమెరికా ఒప్పుకున్నట్టు సమాచారం. కొన్నింటిపై మాత్రం అధిక టారీఫ్ లు తప్పవని చెబుతున్నారు. అలాగే అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 5 నుంచి 8 శాతం వరకు భారత్‌ సుంకాలు విధించడానికి డీల్ కుదిరిందని వార్తలు వస్తున్నాయి. 

నాన్ వెజ్ పాలకు మాత్రం నో..

అయితే ఈ ఒప్పందంలో అమెరికా వ్యవసాయ , పాడి ఉత్పత్తులకు మాత్రం భారత్ నో చెప్పింది. డీల్ లో భాగంగా అమెరికా పాడి ఉత్పత్తుల మీద చాలా ఒత్తిడి తెచ్చిందని..అయినా భారత్ గట్టిగా నిలబడిందని తెలుస్తోంది. భారత్‌లో ఈ రంగాలపై ఆధారపడిన కోట్లాది మంది ప్రయోజనాలు దెబ్బతింటాయని స్పష్టం చేసిందని చెబుతున్నారు.  దానికి తోడు అమెరికా పాటు నాన్ వెజ్ పాలని దిగుమతి చేసుకోవడానికి భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ రెడీగా లేదని తెగేసి చెప్పేసినట్టు సమాచారం. 

ఏంటీ నాన్ వెజ్ పాలు..

పాలన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా. ఎక్కడైనా అవే ఆవులు, గేదెలు. అవి ఇచ్చే పాలు నాన్ వెజ్ ఎలా అవుతాయి అనుకుంటున్నారా. అయితే అమెరికాలో పాడి ఉత్పత్తులు, వాటి పోషణ కాస్త భిన్నగా ఉంటుంది. అక్కడ ఆవులకు గడ్డితో పాటూ కోళ్ళు, చేపలు ఇతర పశువులకు సంబంధించి వ్యర్థ భాగాలు, కొవ్వులతో తయారు చేసిన పదార్థాలను ఆహారంగా వేస్తుంటారు. ఇవి తినడం వలన పాలు మరింత ఎక్కువగా వస్తాయని అంటారు. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం ేస్తోంది. ఇక్కడ మను పాలు వెజ్ ఆహారం. అంతేకాదు ఒకరకంగా పవిత్ర పదార్థ కూడా. అలాంటిది అమెరికాలో జంతు పదార్థాలను తినే ఆవులు, గేదెల నుంచి వచ్చే ‘నాన్‌ వెజ్‌’ పాలు, పాల పదార్థాలు సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని భరత అధికారుల వాదన. అందుకే పాడి ఉత్పత్తులకు నో చెప్పింది. కేవలం ప్రాసెస్‌ చేసిన పాడి ఉత్పత్తుల దిగుమతులకే అంగీకరించింది. వాటిపైనా జంతు సంబంధిత ఆహారం వాడలేదనే ధ్రువీకరణ తప్పనిసరి అని స్పష్టం చేసింది. 

Also Read: Chat GPT: చాట్ జీపీటీ డౌన్..ఈ నెలలో ఇది రెండోసారి

Advertisment
Advertisment
తాజా కథనాలు