/rtv/media/media_files/2025/04/30/DALGvDBotA8QKBJkBxq8.jpg)
simhachalam Chandanotsavam
Simhachalam Temple Incident: విశాఖపట్నం(Visakhapatnam) జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి క్యూలైన్‌లో ఉన్న ఎనిమిది మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రగాఘ సానుభూతి తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఎక్స్‌గ్రేషియా(Ex gratia) ప్రకటించింది. ఈ ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో జిల్లా అధికారులు, మంత్రులు ఆనం, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు పాల్గొన్నారు.
ఇది కూడా చూడండి: Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం
ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ..
ఘటన జరిగిన తీరు క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు అన్ని తెలుసుకున్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి రూ.3 లక్షలు, బాధిత కుటుంబ సభ్యులకు దేవదాయ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడా విచారణ కమిటీ వేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చూడండి: Akshaya Tritiya 2025 నేడు అక్షయ తృతీయ.. బీరువాలో ఈ ఒక్కటి ఉంచితే డబ్బులే డబ్బులు
సింహాచలం చందనోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు లైన్‌లో వేచి ఉన్న భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది స్పాట్‌లోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాచలంలో మంగళవారం అర్థరాత్రి భారీ వర్షం కురవగా.. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలెన్‌లో సిమెంట్ గోడ కూలింది.
ఇది కూడా చూడండి: DC VS KKR: డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి..14 పరుగుల తేడాతో కోలకత్తా విజయం
వెంటనే అధికారులు అక్కడిక చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.