Champions Trophy 2025: ఇది మన సత్తా.. టీమ్ ఇండియాపై ప్రముఖుల ప్రశంసలు!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకు సీఎం రేవంత్ రెడ్డి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మరోసారి భారత్​ సత్తాను చాటి చెప్పిందన్నారు. ఆటగాళ్లందరికీ అభినందనలు తెలిపారు.

New Update
revanth india

revanth india Photograph: (revanth india)

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. దుబాయ్ వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తమ అద్భుత ఆటతీరుతో టీమిండియా మరోసారి ప్రపంచ ఛాంపియన్ గా భారత్​ సత్తాను చాటి చెప్పిందన్నారు. భారత జట్టులోని ఆటగాళ్లందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

టీమిండియా విన్నింగ్‌పై దేశ ప్రధాని మోదీ టీమిండియా జట్టును ప్రశంసిస్తూ విషెష్ తెలిపారు. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తెచ్చినందుకు క్రికెట్ జట్టుకు గర్వంగా ఉందన్నారు. టోర్నీలో టీమిండియా అద్భుతంగా ఆడారని అభినందనలు తెలిపారు.

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసాధారణ విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు అని తెలిపారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం సాధించడం మన జాతికే గర్వకారణమని సోషల్ మీడియా వేదికగా భారత జట్టును అభినందించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు