HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్

ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ లో జనాలు రోడ్ల మీదకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. 

New Update
cric

Hyderabad Cricket Fans

టీ 20 వరల్డ్ కప్, దాని తరువా ఛాంపియన్స్ ట్రోపీ టీమ్ ఇండియా గెలవడంతో భారతీయుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వన్డే వరల్డ్ కప్ పోయిందన్న బాధను మరిపించేలా చేశాయి. ఈ ఆనందంతో భారతీయులు పండుగ చేసుకుంటున్నారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో సంబరాలు మిన్నంటాయి. హైదరాబాద్ లో అయితే ఫ్యాన్స్ రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చసుకున్నారు. డ్యాన్సలు చేస్తూ టీమ్ ఇండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. కేరింతలు కొడుతూ, బాణా సంచా కాల్చుతూ మడావుడి చేశారు. దీంతో దిల్ సుఖ్ నగర్ లో రోడ్లు జనాలతో నిండిపోయాయి. దాంతో ట్రాఫిక్ కు భారీగా అంతరాయం కలిగింది. ఎంత చెప్పినా అభిమానులు రోడ్ల మీద నుంచి కదల్లేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. దెబ్బకు జనాలు పరుగులు తీశారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు