/rtv/media/media_files/2025/04/09/C8xVmt7ojaFPyG87PIjn.jpg)
Muthoot Finance
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు పందిరి వెంకటనారాయణను అదుపులోకి తీసుకున్నారు. పందిరి వెంకటనారాయణ 57 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వెంకటనారాయణ దగ్గర నుంచి రూ.50 లక్షల విలువైన 630 గ్రాముల బంగారం, 3.64 కేజీల వెండి, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. వెంకటనారాయణ దొంగిలించిన నగలను ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడుపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
Also Read : కంగనా ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నటి విమర్శలు!
Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!