/rtv/media/media_files/2025/03/03/0OAKocbccEZCdlqQqZvw.jpg)
crime
దేశంలో రోజురోజుకీ అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా పసి పిల్లలను కూడా వదలడం లేదు. యువకులు, వృద్ధులు బాలికలు, చిన్నారులపై అత్యాచారం చేస్తున్నారు. నిందితుల్లో కూడా ఎక్కువగా మైనర్లే ఉంటున్నారు. అయితే ఇటీవల ఢిల్లీలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని మాయాపురి ఏరియాలో ఉంటున్న మూడేళ్ల చిన్నారిపై పక్కింటి కుర్రాడు అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పసికూనపై ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయాన్ని ఆ చిన్నారి ఇంట్లో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
दिल्ली के मायापुरी इंडस्ट्रियल एरिया में 3 साल की मासूम बच्ची के साथ उसके पड़ोस में रहने वाले युवक ने किया रेप।
— DIVYA SHARMA (@Divyasharmastv) July 16, 2025
बच्ची अभी दीनदयाल अस्पताल में भर्ती।@DCPWestDelhi@ShoMayapuri@DelhiPolice
ఇది కూడా చూడండి:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
ఇటీవల కర్ణాటకలో..
ఇదిలా ఉండగా ఇటీవల కర్ణాటకలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. సందీప్ అనే వ్యక్తి బయాలజీ లెక్చరర్‌గా, అనూప్ అనే మరోవ్యక్తి నాన్ టీచింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. ఆ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యర్థినితో లెక్చరర్ నరేంద్ర అకడమిక్ నోట్స్ షేరింగ్ పేరుతో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అనూప్ ఇంటికి పిలిపించుకుని ఆ విద్యార్థినిని రేప్ చేశాడు. ఈ విషయం మరో లెక్చరర్ సందీప్‌కు కూడా తెలిసింది. దీంతో ఈ విషయం బయటపెడతానని ఆమెను బ్లాక్ మెయిల్ చేసి.. సందీప్ కూడా అత్యాచారం చేశాడు.
ఇది కూడా చూడండి:TG News: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!
ఆ తర్వాత వాళ్లిద్దరిని కలిసేందుకు తన రూమ్‌కు ఆమె వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఉందని అనూప్ కూడా బ్లాక్‌మెయిల్ చేశాడు. అతడు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ముగ్గురూ కూడా ఆమెను బెదిరిస్తూ, బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఇక చివరికి ఆ విద్యార్థిని కలిసేందుకు ఆమె తల్లిదండ్రులు కాలేజీకి వచ్చారు. దీంతో ఆమె జరిగిన విషయం వాళ్లకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి ఆ ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి:పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !
rape | crime news