Delta Airlines Flight: షాకింగ్ వీడియో.. గాల్లో ఉండగానే విమానంలో మంటలు..

శుక్రవారం అట్లాంటాకు వెళుతున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. లాస్ ఏంజిల్స్ నుండి టేకాఫ్ అయిన వెంటనే ఎడమ వైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. పైలట్స్ వెంటనే ఆ విమానాన్ని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (LAX)లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

New Update
Delta Airlines Boeing 767 flight engine catches fire

Delta Airlines Boeing 767 flight engine catches fire

మరో విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. శుక్రవారం అట్లాంటాకు వెళుతున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం లాస్ ఏంజిల్స్ నుండి టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదానికి గురైంది. దాని ఎడమ వైపు ఇంజిన్‌లో  ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అంతా ఉక్కిరి బిక్కిరి అయ్యారు. గమనించిన పైలట్స్ వెంటనే ఆ విమానాన్ని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (LAX)లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

Also Read: డైనోసార్‌ అస్థిపంజరానికి వేలంలో రూ.260 కోట్లు

Delta Airlines

వీడియో ఫుటేజ్‌లో.. బోయింగ్ 767-400 విమానంతో నడిచే డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం 446.. లాస్ ఏంజిల్స్ విమానాశ్రయం (LAX) మీదుగా ఎగురుతున్నప్పుడు దాని ఎడమ ఇంజిన్ నుండి మంటలు వస్తున్నట్లు చూపించింది. విమానం లాస్ ఏంజిల్స్ మీదుగా తిరుగుతూ సురక్షితంగా LAXకి తిరిగి రావడాన్ని వీడియోలో చూడవచ్చు. 

Also read: 'ఉరిశిక్ష రద్దు.. నిమిష ప్రియ విడుదల!'

ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యే సమయానికి.. అగ్నిమాపక సిబ్బంది రన్‌వే వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ‘‘డెల్టా విమానం 446 బయలుదేరిన కొద్దిసేపటికే.. విమానం ఎడమ ఇంజిన్‌లో సమస్య ఉన్నట్లు సూచన రావడంతో లాస్ ఏంజిల్స్‌కు తిరిగి వచ్చింది’’ అని డెల్టా ఎయిర్‌లైన్ ప్రతినిధి ఒకరు తెలిపారు . 

Also Read : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్

Also Read : ఇజ్రాయెల్, సిరియా మధ్య కాల్పుల విరమణ

Advertisment
Advertisment
తాజా కథనాలు