AP Crime : న్యాయం కోసం వెళ్తే కాటేసిన పోలీసు కామాంధులు!

న్యాయం కోసం ఓ మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్తే సాయం చేయాల్సిన పోలీసులే కామాంధులుగా మారారు. ఓ  వివాహితపై కానిస్టేబుల్‌, హోంగార్డు అడవిలో అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఫోన్ నెంబర్ తీసుకొని హోంగార్డ్ వేధింపులకు పాల్పడ్డారు.

New Update
ap police

న్యాయం కోసం ఓ మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్తే సాయం చేయాల్సిన పోలీసులే కామాంధులుగా మారారు. ఓ  వివాహితపై కానిస్టేబుల్‌, హోంగార్డు అడవిలోఅఘాయిత్యానికి(sexual-assault) పాల్పడ్డారు. ఫోన్ నెంబర్ తీసుకొని హోంగార్డ్ వేధింపులకు పాల్పడ్డారు. సాయం అడిగితే మత్తుమందు ఇచ్చి కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ ఘటన జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేక పలమనేరు పీఎస్‌కు వచ్చిన బాధితురాలుకు పలమనేరు హోంగార్డ్, బంగారుపాళ్యం  కానిస్టేబుల్ వేధింపులకు గురిచేశారు. ఈ ఘటనపై ఈనెల 13న ఎస్పీకి ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌, హోంగార్డు ప్రస్తుతం పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read :  పుణె యూనివర్సిటీకి రూ.2.46 కోట్ల కుచ్చుటోపీ.. తెలుగు ఇంజినీర్‌ అరెస్టు

బాధితురాలికి ముగ్గురు పిల్లలు

బాధితురాలి ఫిర్యాదు మేరకు గంటావూరుకు చెందిన బాధితురాలికి ముగ్గురు పిల్లలున్నారు. భర్త వేధింపులతో ఆమె నాలుగు నెలల క్రితం పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అయితే ఆమె అందంగా ఉందని సీఐ డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డు కిరణ్‌కుమార్‌ ఆమెపై కన్నేశాడు. బాధితురాలి ఫిర్యాదులోని ఫోన్‌ నంబరును తీసుకుని ఆమెకు చేస్తానంటూ బాధితురాలికి రాత్రుల్లో ఫోన్‌ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో బాధితురాలు తనకు తెలిసిన వారి ద్వారా పలమనేరులో పనిచేసే మరో హోంగార్డు ఉమాశంకర్‌కుతన బాధను చెప్పింది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ కానిస్టేబుల్‌ కూడా ఆమెను వాడుకోవాలిని అనుకున్నాడు.

నేరుగా బాధితురాలి ఇంటికెళ్లి అంతా తాను చూసుకుంటానని నమ్మబలికాడు. ఆపై అతను కూడా బాధితురాలికి రాత్రుల్లో ఫోన్‌లు చేయడం మొదలు పెట్టాడు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు దేవుడెరుగు ఆ ఇద్దరి వేధింపులతో ఏం చేయలేని బాధితురాలు తీవ్రంగా మనోవేదన అనుభవించింది. దీంతో తనకు జరిగిన అన్యాయంపై జిల్లా ఎస్పీగా వచ్చిన తుషార్‌డూడిని ఇటీవలే కలిసి జరిగిన ఘోరంపై ఫిర్యాదు చేసింది.దీనిపై విచారణ చేయాలని పలమనేరు సీఐ మురళీమోహన్‌కు అప్పజెప్పారు. అయినప్పటికీ తనకు న్యాయం జరగకపోవడంతో బాధితురాలు  బుధవారం చిత్తూరులో ప్రెస్‌మీట్‌ పెట్టి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దీంతో పోలీసుల వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

దేవరకొండలో ఆలయం వద్ద ఆత్మహత్య చేసుకుందామని బాధితురాలు అనుకుంది. అయితే ఈ సమయంలో కొండపైకి గస్తీ కోసమెళ్లిన బంగారుపాళెం పోలీస్ స్టేషన్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు బాధితురాలిని చూసి అడవిలో ఏం చేస్తున్నావని ఆరా తీశారు. దీంతోతనది పలమనేరని చెప్పగా తెలిసినవారెవరైనా ఉన్నారా అనగానే.. ఆమెను వేధిస్తున్న కానిస్టేబుల్‌ నంబరు ఇచ్చింది. దీంతో వారు అతడికి కాల్‌ చేయగా ఆమె తనకు తెలుసునని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. దీన్ని అదునుగా భావించిన ఆ కానిస్టేబుల్‌ ఓ కారులో ఇక్కడికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్‌ కాదని సముదాయించి పిల్లలతో పాటు బాధితురాలికి మద్యం కలిపిన కూల్‌డ్రింక్‌ బాటిళ్లను ఇచ్చి వారు మత్తులో ఉండగా పిల్లలను కారులో పడుకోబెట్టి బాధితురాలితో పాటు కొండపైనుంచి కిందికి వస్తూ అడవిలోని మరో దారిలోకి తీసుకెళ్లి అక్కడ బాధితురాలిపై లైంగిక దాడి చేసినట్టు తన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. జరిగిన విషయంపై ఎవరికై నా చెబితే ప్రాణాలతో ఉండరని బెదిరించడంతో బాధితురాలు ఏం చేయలేకపోయింది.

Also Read :  ముగ్గురు బాలికలు మిస్సింగ్.. పిక్నిక్‌ కు అని  తీసుకెళ్లి  ఆ తర్వాత..

Advertisment
తాజా కథనాలు