/rtv/media/media_files/2025/07/10/child-marriage-taliban-2025-07-10-15-44-11.jpg)
Afghanistan Child Marriage
Afghanistan Child Marriage:
అతనికి 45ఏళ్లు, ఆరేళ్ల బాలికలతో బాల్య వివాహం చేసిన దారుణ ఘటన దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో వెలుగు చూసింది. మార్జా జిల్లాలో బలవంతంగా వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ వ్యక్తికి మరో ఇద్దరు భార్యలు ఉన్నారు. అతను ఆ చిన్నారి కుటుంబానికి డబ్బు చెల్లించి బాలికను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ బాలికను అతను తీసుకెళ్లకుండా స్థానికులు అడ్డుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులో బాలికను భర్త అతని ఇంటికి తీసుకెళ్లవచ్చని సదరు వ్యక్తి వాదించాడు. ఆమెను తీసుకెళ్లడానికి చిన్నారి వయసు 9ఏళ్లు అని చెప్పాడు. అయినా సరే ఆ బాలికను అతని ఇంటికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు.
Also Read: పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..
https://t.co/V1iRSD9LYh
— Ullas Saxena (@susaxena55) July 8, 2025
Terrorist countries Pakistan and Afghanistan are allowing child marriages which is the biggest crime.
బాలిక తండ్రి, వరుడిని మార్జా జిల్లాలో అరెస్టు చేశారు. అధికారిక అభియోగాలు నమోదు చేయబడలేదు. ఆ బాలిక ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంది. తాలిబన్ ఆచారం ప్రకారం పెళ్లిలో వాల్వార్ అనే కార్యక్రమం ఉంటుంది. అమ్మాయి శారీరక రూపం, విద్య, నేర్చుకున్న విలువ ఆధారంగా వధువు ధర నిర్ణయించి.. ఆ మొత్తాన్ని తండ్రికి చెల్లిస్తారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read:చెడు కలలతో టార్చర్‌గా ఉందా..? ఈ పని చేయడం మానేస్తే చాలా..!!
ఆఫ్ఘనిస్తాన్‌లో వివాహానికి చట్టబద్ధమైన కనీస వయస్సు లేదు. బాలికలకు కనీస వయస్సు 16ఏళ్లుగా నిర్ణయించినప్పుటికి .. ఆ నిబంధనల అక్కడ ఎవరూ పట్టించుకోరు. 2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుండి దేశంలో బాల్య వివాహాలు పెరిగాయి. గత సంవత్సరం UN Women నివేదిక ప్రకారం.. తాలిబన్లు బాలికల విద్యపై నిషేధం విధించడం వల్ల దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు 25% పెరిగాయి. ముందస్తు ప్రసవాలు 45% పెరిగాయి.
Also Read:హైదరాబాద్‌లో విషాదం... సైబర్ నేరగాళ్ల మోసానికి ఏపీ మహిళ ఆత్మహత్య