/rtv/media/media_files/2025/07/18/chaitanya-baghel-2025-07-18-13-25-43.jpg)
Liquor Scam Case:
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకుని లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేసింది ఈడీ(ED). చత్తీస్‌ఘడ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్(Former Chhattisgarh CM Bhupesh Baghel) కుమారుడు చైతన్య భగేల్‌ను(Chaitanya Baghel) శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు(Enforcement Directorate Officials) అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2100 కోట్ల లిక్కర్ స్కామ్‌తో సంబంధాలు ఉన్న మనీల్యాండరింగ్ కేసులో(Money Laundering Case) అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం దుర్గ్ జిల్లాలోని బిలాయి పట్టణంలో ఉన్న ఆయన నివాసంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. రెయిడ్స్ ముగిసిన తర్వాత అతన్ని అరెస్టు చేశారు.
🚨Just in: Bhupesh Baghel's Son Chaitanya Arrested By Probe Agency ED After Raids
— Simran (@SimranBabbar_05) July 18, 2025
Reports suggest the arrest comes as the probe agency grills links over the alleged Liquor scam. @bhupeshbaghel@INCIndia@INCChhattisgarh@RahulGandhipic.twitter.com/m4qeDuRjZm
చైతన్య భగేల్‌పై ఈడీ విచారణ చేపట్టడం ఈ ఏడాది ఇది రెండోసారి. లిక్కర్ స్కామ్‌లో తమకు కొత్త ఆధారాలు దొరికినట్లు ఈడీ చెబుతోంది. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు కావడంతో రాజకీయ కక్షతో ఈడీ సోదాలు చేపడుతున్నారని మాజీ సీఎం భూపేశ్ భగేల్ ఆరోపించారు.