Dancer Rape: మరో ఘోరం.. భర్తముందే డ్యాన్సర్‌పై లైంగిక దాడి.. ముగ్గురు ఒకేసారి!

బీహార్ రాజధాని పాట్నాలో ఘోరం జరిగింది. ప్రముఖ లేడీ డ్యాన్సర్‌పై భర్త ముందే ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఓ కార్యక్రమానికి వెళ్లివస్తుండగా ఈ దారుణం జరిగింది. ఇద్దరిని అరెస్ట్ చేసి మరొక నిందితుడికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

New Update
Haryana Gang Rape

Bihar Lady dancer sexually assaulted

Dancer Rape: బీహార్ రాజధాని పాట్నాలో ఘోరం జరిగింది. భర్త కళ్లముందే మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుర్మర్గులు. డ్యాన్సర్‌గా జీవినం కొనసాగిస్తున్న వివాహిత తన భర్తతో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లివస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. ఇద్దరినీ బంధించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు ఆమెపై లైంగిక దాడి చేసి పారిపోయారు. ఈఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

బైక్ పై డ్రాప్ చేస్తామని..

ఈ మేరకు దనాపూర్ పోలీసు సూపరింటెండెంట్ (ASP) భాను ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. డ్యాన్సర్ అయిన బాధిత మహిళ తన భర్తతో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తోంది. ఈ క్రమంలోనే షాపూర్ శివార్లలో రోడ్డుమీద వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను రైల్వే స్టేషన్ కు దారి అడిగారు. దీంతో ఆ జంటను తమ మోటార్ సైకిల్‌పై డ్రాప్ చేస్తామని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. మొదట ఆ మహిళ భర్తను బందించి.. అతని ముందే అతని భార్యపై అత్యాచారం చేశారు. ముగ్గురు నిందితులు పారిపోయారు. 

Also Read: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..

బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు ప్రారంభించారని ఏఎస్పీ భాను ప్రతాప్ సింగ్ తెలిపారు. ఇందులో భాగంగా నిందితులు మనోజ్ కుమార్, మనీష్ కుమార్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశామని, మూడో నిందితుడు నాగేంద్ర కుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. 

Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

 bihar | women | telugu-news | today telugu news | sexual-assault 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు