/rtv/media/media_files/2025/02/06/96PeaR0hKkht3gP21e1m.webp)
ACCIDENT
ఈ మధ్య కాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. జాగ్రత్తగా వాహనాలను నడపకపోవడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే ఇటీవల అన్నమయ్య జిల్లా పిలేరు మండలంలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణించడం వల్ల కారు బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం
తమిళనాడులోనూ ఘోర రోడ్డు..
ఇదిలా ఉండగా తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం కరూర్‌లో బెంగళూరు నుండి తమిళనాడులోని నాగర్‌కోయిల్‌కు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బస్సు డ్రైవర్ ఫ్లైఓవర్ కిందకు దిగుతుండగా వాహనంపై నియంత్రణ కోల్పోయి ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. ఆ తర్వాత బస్సు బోల్తా పడి ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది.
ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!
బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కరూర్ టౌన్ డీఎస్పీ సెల్వరాజ్ వి సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మరణించిన ఐదుగురిలో ఒక బాలిక కూడా ఉంది. గాయపడిన వారు ప్రస్తుతం కరూర్‌లోని స్థానిక ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు, ట్రాక్టర్, వ్యాన్ ముందు భాగాలు దెబ్బతిన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Hydra: చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే జైలుకే.. హైడ్రా సంచలన నిర్ణయం!
accident | crime news | chittor | annamayya