/rtv/media/media_files/2025/02/16/9bGFosPlBGKgAMKGuvHm.webp)
Vaikuntha Dwara Darshan
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (ttd) తీపి కబురు అందించింది. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాన్ని(Vaikuntha Dwara Darshan) డిసెంబర్ 30వ తేదీ నుంచి పది రోజుల పాటు కొనసాగించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి సాధారణ భక్తులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించినట్లు ఆయన స్పష్టం చేశారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనంలో మొత్తం 182 గంటల దర్శన సమయం ఉండగా, అందులో 164 గంటలను ప్రత్యేకంగా సాధారణ భక్తులకే కేటాయించినట్లు టీటీడీ ప్రకటించింది.
దర్శనం కేవలం..
మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30, 31, జనవరి 1).. ఈ మూడు రోజులు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు శ్రీవాణి దర్శనాలు రద్దు చేయబడ్డాయి. దర్శనం కేవలం లక్కీ డిప్ ద్వారానే అనుమతించబడుతుంది. లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా డిసెంబర్ 2వ తేదీన లక్కీ డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు టోకెన్లు జారీ చేయబడతాయి. జనవరి 2 నుంచి జనవరి 8 రోజుల్లో రోజువారీగా 15 వేల రూ.300 దర్శన టిక్కెట్లు, ఒక వెయ్యి శ్రీవాణి దర్శన టిక్కెట్లు కేటాయించబడుతున్నాయి. ఈసారి స్థానిక భక్తులకు కూడా టీటీడీ ప్రత్యేక కేటాయింపులు చేసింది. జనవరి 6, 7, 8వ తేదీలలో రోజుకు 5,000 టోకెన్లను స్థానికులకు కేటాయించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: ఏపీ MLA భార్య డిజిటల్ అరెస్ట్.. కోటి 70 లక్షలు దోచేసిన కేటుగాళ్లు - చివరికి..!
వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మొదటి ఏడు రోజుల పాటు (డిసెంబర్ 30 నుండి జనవరి 5 వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం, ఇతర ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. సాధారణ భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. ఈ ఏడాది టీటీడీ తీసుకున్న ఈ కీలక నిర్ణయం సాధారణ భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోనట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: పోలీసులకు చుక్కలు చూపించిన ఏడో తరగతి బాలిక.. స్కూలుకు వెళ్లడం ఇష్టం లేక ఏం చేసిందంటే?
Follow Us