UP crime : ఉత్తరప్రదేశ్‌లో దారుణం..  దివ్యాంగురాలిని వేటాడి, వెంటాడి మరీ అత్యాచారం!

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 22ఏళ్ల దివ్యాంగురాలిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బైక్‌లపై వెంటాడి, ఎత్తుకెళ్లి మరీ నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.  

New Update
up crime

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 22ఏళ్ల దివ్యాంగురాలిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బైక్‌లపై వెంటాడి, ఎత్తుకెళ్లి మరీ నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.  సీసీకెమెరాల సాక్షిగా ఈ దాష్టీకం  వెలుగులోకి వచ్చింది. యువతి రోడ్డుపై పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాధితురాలు ఇంటికి రాకపోవడంతో ఆమె  కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.  పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని పొలాల్లో ఆమె పడి ఉండటం గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారుల నివాసాలకు కొంత దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.  

24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు

దీనిపై బాధిత కుటుంబ సభ్యులు బలరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగిన 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు పోలీసులు. నేపాల్ కు పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించగా పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. నిందితులను అంకుర్ వర్మ(21), హర్షిత్ పాండే(22) గా గుర్తించారు. నిందితులను పట్టుకునే క్రమంలో వారిపై కాల్పులు జరిపారని పోలీసు సూపరింటెండెంట్‌ వికాస్‌ కుమార్‌ తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.  ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  

ఆపరేషన్ త్రినేత్ర

కాగా ఉత్తరప్రదేశ్‌లో నేరాలను అరికట్టడానికి, నేరస్తులను గుర్తించడానికి ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆపరేషన్ త్రినేత్ర అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా, రాష్ట్రంలోని నేరాలకు ఎక్కువగా అవకాశం ఉన్న ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల సహాయంతో నేరాలకు పాల్పడేవారి కదలికలను నిశితంగా పర్యవేక్షించి త్వరగా నిందితులను పట్టుకోవడం ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యంగా చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు