/rtv/media/media_files/2025/08/16/anantapur-2025-08-16-06-36-53.jpg)
వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైపోయింది. ఎన్ని డబ్బులు ఇచ్చిన వారిలో మార్పు రాకపోవడంతో మనస్థాపానికి గురై చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లప్పదొడ్డి కాలనీకి చెందిన శ్రీనివాసులతో శ్రావణికి నాలుగేళ్ల క్రితం పెళ్లి అయింది. పెళ్లి అయిన కొద్దీరోజుల నుంచే శ్రావణికి అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయి.
Also read : TSLPRB: తెలంగాణలో118 APP పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
చాలా సార్లు పంచాయితీలు పెట్టించినా
భర్త, అత్తామామలు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. పెద్దల సమక్షంలో చాలా సార్లు పంచాయితీలు పెట్టించినా వారి నుంచి వేధింపులు మాత్రం ఆగకపోవడంతో చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐదు రోజుల కిందట రూ.1.50లక్షలు ఖర్చు చేసి బంగారం చేయించామని అయినప్పటికీ వారి వేధింపులు ఆగలేదని వాపోయాడు. కొంతమంది టీడీపీ నాయకులతో కలిసి ఫిర్యాదును తిరగరాయించుకొని అత్తింటివారిని ఏం చేయలేకపోయారన్నారు.
కడుపులో బిడ్డతో పాటు
చివరకు తన కూతురు మనస్థాపానికి గురై కడుపులో బిడ్డతో పాటు బలవన్మరణానికి పాల్పడిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కేసులో నిందితులను విచారించి తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిబాబు మీడియాకు తెలిపారు. ఈనెల 11న పోలీసుస్టేషన్‌లో కేసు నమోదవడంతోనే శ్రావణి అత్తామామలతోపాటు భర్తను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. తాజాగా శ్రావణి ఫోన్ కాల్ కు సంబంధించిన ఆడియో బయటపడిందని దానిపై వారిని వివరాలు అడిగి తెలుసుకుంటామని తెలిపారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
అనకాపల్లిలో దారుణం
ఏపీలోని అనకాపల్లిలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సబ్బవరం మండలం బంజరి వద్ద గుర్తు తెలియని గర్భవతిని కొందరు దుండగులు హత్య చేసి కాల్చిపడేశారు. సంఘటనా స్థలాన్ని అనకాపల్లి జిల్లా పోలీస్ సూపర్డెంట్ తుహిన్ సిన్హా పరిశీలించారు. సంఘటన స్థలంలో డాగ్ స్క్వెడ్, క్లూస్ టీం తనిఖీలు చేపట్టారు. మృతిరాలి వయస్సు దాదాపుగా 32 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు గుర్తించారు. గర్భిణికి తెలిసిన వారే కాళ్లు చేతులు కట్టేసి, పీక నులిమి చంపేసినట్లు ఆనవాళ్లు గుర్తించారు. గర్భిణి అని చూడకుండా అతి క్రూరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గర్భిణి భర్త లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఇలా చేశారా? లేకపోతే బయట వారు ఇలా చేశారా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులను అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also read : Jharkhand : బాత్రూంలో జారిపడి జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి కన్నుమూత!