Shocking News: షాకింగ్ న్యూస్.. ఇద్దరి ప్రాణం తీసిన కుక్క గోళ్లు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వన్‌రాజ్ మంజరియాకు కుక్క గోరు గుచ్చుకుని తగలడంతో రేబిస్ సోకి మృతి చెందాడు. అలాగే తెలంగాణలో ఓ యువకుడికి కూడా కుక్క గోరు గుచ్చి చనిపోయాడు.

New Update
Dog nails

Dog nails

చాలా మంది పెంపుడు జంతువైన కుక్కను పెంచుకుంటారు. ఇంట్లోకి ఎవరైనా ప్రవేశించినా గుర్తించడానికి, మరికొందరు ఒంటరితనం పోవడానికి ఉంచుకుంటారు. అయితే దీనివల్ల కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వన్‌రాజ్ మంజరియా కుక్కను పెంచుకుంటున్నాడు. కొన్ని రోజుల కిందట పెంపుడు కుక్క గోరు పోలీస్‌కు తగిలింది. దీంతో అతనికి రేబిస్ సోకడంతో మృతి చెందాడు. ఆ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కూడా చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యంగా తీసుకోవడంతో ప్రాణాలు కోల్పోయారు. 

ఇది కూడా చూడండి: Hyderabad : నల్సార్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి..రహస్యంగా తరలించిన యజమాన్యం

కుక్క గోళ్లు గుచ్చుకుని..

ఇదిలా ఉండగా ఇలాంటి ఘటన తెలంగాణలోనూ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పెంపుడు కుక్క గోరు గుచ్చుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కొత్తగూడెంలో చోటుచేసుకుంది. ఏడూళ్లబయ్యారానికి చెందిన సందీప్ రెండు నెలల కిందట కుక్కపిల్లను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కుక్కను దగ్గర చేసుకునే సమయంలో తన తండ్రిని కరిచింది. అదే సమయంలో కుక్క కాలి గోరు సందీప్‌కు గుచ్చుకుంది. తండ్రికి కరవడంతో ఆ యువకుడు చికిత్స చేశాడు. కానీ తనకి చికిత్స చేయించుకోకుండా లైట్ తీసుకున్నాడు. దీంతో రేబిస్ సోకగా.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. పెంపుడు జంతువులను పెంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చూడండి: మానవత్వం మంటగలిసింది: 15 రోజుల పసికందు నోట్లో గ్లూ పోసి..

Advertisment
తాజా కథనాలు