Bangladesh: భారత్‌కు బద్ధ శత్రువుగా మారుతున్న బంగ్లాదేశ్.. 10 షాకింగ్ పరిణామాలు!

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా ముహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు. భారత్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతీసేలా ఆయన వ్యవహరిస్తున్నాడు. యూనస్ అనేక నిర్ణయాలు, ప్రకటనలు ఇండియా విద్ధంగా ఉంటున్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు మనం చూద్ధాం..

New Update
Yunus government with India

బంగ్లాదేశ్‌లో పాలన మారినప్పటి నుంచి అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఓ స్వతంత్ర దేశంగా ఉందంటే దాకి కారణం ఇండియా. దగ్గరుండి పాకిస్తాన్‌తో పోరాటం చేసి ప్రత్యేక దేశంగా బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేస్తే.. ఇప్పుడు బంగ్లాదేశ్ తిన్నింటి వాసలు లెక్కెడుతుంది. ఆ దేశంలో రిజర్వేషన్ల అంశంలో ప్రధాని షేక్ హసీనాపై తిరుగుబాటు చేశారు బంగ్లాదేశ్ యువకులు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా ముహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు. భారత్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతీసేలా ఆయన వ్యవహరిస్తున్నాడు. యూనస్ అనేక నిర్ణయాలు, ప్రకటనలు ఇండియా విద్ధంగా ఉంటున్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు మనం చూద్ధాం..

Also Read :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు

షేక్ హసీనాకు ఆశ్రయంపై ఆందోళనలు, హెచ్చరికలు: 

షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌లో ఆశ్రయం పొందిన తర్వాత, ఆమెను అప్పగించాలని లేదా కనీసం బంగ్లాదేశ్ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించకుండా నిరోధించాలని యూనస్ ప్రభుత్వం పరోక్షంగా భారత్‌ను కోరింది. హసీనా భారత్‌లో ఉండి బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, దీనివల్ల సంబంధాలు దెబ్బతింటాయని యూనస్ వర్గం హెచ్చరించింది.

ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు: 
ముహమ్మద్ యూనస్, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఇది భారత్-బంగ్లా సంబంధాల మధ్య దూరం పెంచిందని నివేదించబడింది. ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఖండించారు.

మైనారిటీలపై దాడులు, భారత్ ఆందోళన: 
యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు పెరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ దాడులు మతపరమైనవి కావని, రాజకీయ ఉద్దేశాలతో చేశారని యూనస్ వ్యాఖ్యానించడం భారత్‌లో ఆందోళన కలిగించింది. మైనారిటీల రక్షణపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశంగా మారుతుంది. రానురాను భారత్‌పై పగ పెంచుకుంటోంది.

Also Read :  కవిత సంచలన వ్యాఖ్యలు.. వారికి సీరియస్ వార్నింగ్!

చైనా, టర్కీతో పెరుగుతున్న సాన్నిహిత్యం: 
యూనస్ ప్రభుత్వం చైనా, టర్కీ దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. యూనస్ చైనా పర్యటన, భారీ పెట్టుబడుల కోసం విజ్ఞప్తి చేయడం, తీస్తా నది ప్రాజెక్టులో చైనా ప్రమేయాన్ని స్వాగతించడం వంటివి భారత్ భద్రతాపరమైన ఆందోళనలకు దారితీశాయి. చైనా-బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న స్నేహం భారత్‌కు వ్యూహాత్మక ఆందోళనగా మారింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్‌కు దగ్గరవుతూ టర్కీ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానిక బంగ్లాదేశ్ సిద్ధమవుతుంది. బంగ్లాదేశ్ టర్కీ నుంచి ఆయుధాలు కొంటే ఇండియా సరిహద్ధులో వాటిని మోహరించే అవకాశం ఉంది.

పాకిస్తాన్‌తో సంబంధాల పునరుద్ధరణ: 
యూనస్ పాలనలో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌కు దగ్గరవుతోందని, పాక్ పౌరులకు వీసా నిబంధనలను సడలించడం వంటి చర్యలు తీసుకుందని ఆరోపణలు వచ్చాయి. ఇది భారత్‌కు ఆందోళన కలిగించింది, ఎందుకంటే పాకిస్తాన్‌తో భారత్‌కు సున్నితమైన సరిహద్దు సంబంధాలు ఉన్నాయి.

అవామీ లీగ్‌పై నిషేధం, రాజ్యాంగ ఉల్లంఘన: 
యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించింది. ఇది చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని షేక్ హసీనా ఆరోపించారు. ఈ చర్య బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగించవచ్చని, ఇది భారత్‌కు ఆందోళన కలిగించే అంశమని భావించారు.

తీవ్రవాద శక్తులకు మద్దతు ఆరోపణలు: 
షేక్ హసీనా, ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం "ఉగ్రవాదుల సహాయంతో" అధికారాన్ని ఆక్రమించిందని, అంతర్జాతీయంగా నిషేధించిన తీవ్రవాద సంస్థలే ఆయనకు బలంగా నిలిచాయని ఆరోపించారు. ఇది బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద శక్తులకు స్వేచ్ఛనిచ్చి, తద్వారా భారత్‌కు భద్రతాపరమైన సవాళ్లను సృష్టించవచ్చని భయాలు వ్యక్తమయ్యాయి.

Also Read :  రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తే అస్సలు నిద్ర పట్టదు.. అవేంటో తెలుసుకోండి!

ఉగ్రవాదులను నిర్దోషులుగా ప్రకటించే ప్రయత్నాలు: 
కరుడుగట్టిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న సయ్యద్ జిలా ఉల్ హక్‌ను నిర్దోషిగా ప్రకటించే ప్రక్రియను యూనస్ ప్రభుత్వం చేపట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇది భారత్, అమెరికాలకు తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది.

మయన్మార్‌లోని రఖైన్ కారిడార్‌పై వివాదం: 
మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో "మానవతా దారిద్య్ర కారిడార్" ఏర్పాటుకు సంబంధించి యూనస్ తీసుకున్న నిర్ణయంపై బంగ్లాదేశ్ సైన్యం కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ కారిడార్ భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన సిలిగురి కారిడార్‌ (చికెన్ నెక్) ప్రాంతానికి సమీపంలో ఉండటం, చైనా ప్రభావం పెరిగే అవకాశం ఉండటంతో భారత్ కూడా దీని పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.

ద్వైపాక్షిక చర్చల్లో షేక్ హసీనా అంశాన్ని ప్రస్తావించడం: 
ప్రధానమంత్రి మోదీ, యూనస్‌ల మధ్య జరిగిన సమావేశంలో, షేక్ హసీనాను అప్పగించడం, భారత్ నుండి ఆమె చేసిన "రెచ్చగొట్టే" వ్యాఖ్యలను యూనస్ లేవనెత్తినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తెలిపింది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపగల సున్నితమైన అంశం.

ఈ నిర్ణయాలు, వ్యాఖ్యలు బంగ్లాదేశ్‌లో అంతర్గత రాజకీయ పరిస్థితులతో పాటు, భారత్-బంగ్లాదేశ్ సంబంధాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇలానే ఇరు దేశాల మధ్య పరిణామాలు చోటుచేసుకుంటే ఇండియా, బంగ్లా వివాదం తీవ్రం కానుంది.

Also Read :  బిగ్ న్యూస్.. తెలంగాణలో రేపు స్కూళ్లకు సెలవు!

decisions | india | Muhammad Yunus government | bangaladesh

Advertisment
తాజా కథనాలు