/rtv/media/media_files/2025/05/03/inOQ5zX6sHeJK5lou5Zn.jpg)
jagital women
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. పిల్లలు పుట్టడం లేదనే కారణంతో కట్టుకున్న భార్యను ఓ భర్త ఉరివేసి మరి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడిమ్యాలకు చెందిన మహేందర్‌కు మమతతో పెళ్లి జరిగింది. మమతను అదనపు కట్నం కోసం వేధించిన మహేందర్ .. పిల్లలు పుట్టడం లేదంటూ కూడా ఆమెను ఫ్యామిలీని టార్చర్ పెడుతున్నాడు. దీంతో భర్త వేధింపులు భరించలేక మమత పుట్టింటికి వెళ్లిపోయింది.
Also read : India-Pak Border: టెన్షన్.. టెన్షన్.. సరిహద్దుల్లో మరో ఉగ్రకుట్ర భగ్నం
Also read : Marriage Cancel : కాబోయే భార్యకు లవర్ ఉన్నాడని ..పెళ్లి పీటల మీద ట్విస్ట్ ఇచ్చిన వరుడు!
జగిత్యాలలో దారుణం
— dktimestelugu (@dktimestelugu) May 3, 2025
పిల్లలు పుట్టలేదు అని భార్య మమతను ఉరి వేసి హత్య చేసిన భర్త మహేందర్
వరకట్నం, సంతానం లేదని భర్త, అత్తమామలు, కుటుంబసభ్యుల వేధింపులు
భార్యను ఇంటికి తీసుకెళ్లి గత నెల 24న హత్యచేసిన భర్త pic.twitter.com/EdsStSlQFw
ఊపిరాకడకుండా చంపేశాడు
అయితే ఏప్రిల్ 24న భార్యను ఇంటికి తీసుకొచ్చిన మహేందర్.. అదే రోజు రాత్రి మమత చంపేందకు ప్లాన్ రెడీ చేశాడు. ఆమె మెడకు తాడుతో బిగించి ఊపిరాకడకుండా చంపేశాడు. అనంతరం మమత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహేందర్ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వ్యక్తం చేసి పోలీసులుకు సమాచారం ఇచ్చారు. కుళ్లిన స్థితిలో బయటపడ్డ మమత మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న కొడిమ్యాల పోలీసులు మహేందర్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Also read : BCCIకి బిగ్ షాక్.. రోబో కుక్క వల్ల కోట్లలో లాస్.. హైకోర్టు నోటీసులు!
Also Read : UPSC CSE 2024 : కళ్లు కనిపించవు, తల్లి ప్రోత్సాహం.. UPSC ఫలితాల్లో 91వ ర్యాంక్ !
jagtial | husband | wife | childrens | karimnagar