/rtv/media/media_files/2025/05/01/z8MmP5LXKEvty9gF1Yf1.jpg)
robo dog
ఐపీఎల్ లో రోబోట్ డాగ్ ను దాదాపుగా క్రికెట్ ఫ్యాన్స్ చూసే ఉంటారు. టాస్ వేసే సమయంలో మైదానంలో కెప్టెన్లతో పాటుగా ఈ రోబో డాగ్ కూడా వస్తుంది. ఈ రోబో కుక్కకు చంపక్ (చంపక్ రోబోట్ డాగ్) అని పేరు పెట్టారు. ఈ పేరు కారణంగా ఇప్పుడు బీసీసీఐకి ఊహించని షాక్ ఎదురైంది. ఏకంగా ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపించింది. పరువునష్టం కింద రూ.2 కోట్లను చెల్లించాలంటూ బీసీసీఐపై ఓ ప్రసిద్ధ పిల్లల పత్రిక కేసు వేసింది.
పిల్లల కోసం మ్యాగజీన్
చంపక్ అనేది ఢిల్లీ ప్రెస్ పేపర్ .. ఓ పాపులర్ చిల్డ్రన్ మ్యాగజీన్ అన్నమాట. 1968 నుంచి తాము చంపక్ పేరిట పిల్లల కోసం మ్యాగజీన్ ప్రచురిస్తున్నామని.. తమ అనుమతి లేకుండానే బీసీసీఐ తమ ట్రేడ్‌మార్క్ వాడుకుందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.రోబో కుక్కకు చంపక్ అని పేరు పెట్టడం ద్వారా తమరిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పిటిషన్ ధాఖలు చేసింది. రోబో డాగ్‌కు చంపక్ అని పేరు పెట్టడం వలన తమ ట్రేడ్‌మార్క్, బ్రాండ్ దెబ్బతిందని, పరువునష్టం కింద తమకు బీసీసీఐ రూ.2 కోట్లు చెల్లించాలంటూ కోర్టును కోరింది.
దీనిపై జస్టిస్ సౌరభ్ బెనర్జీ దాఖలు చేసిన కేసుపై బీసీసీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీని మీద 4 రోజుల్లో లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ జూలై 9న జరుగనుంది. కాగా ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్స్- ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా ఈ రోబో డాగ్ ను ఐపీఎల్ నిర్వాహకులు పరచయం చేశారు. రిమోట్‌తో ఆపరేట్ చేసే ఈ రోబో కుక్కకు ఏప్రిల్ 20న ‘చంపక్’గా పేరు పెట్టారు. ఈ రోబో డాగ్‌కు తాము ఎంచుకున్న పేర్లలో ఎక్కువ మంది చంపక్‌కే చాలామంది ఓటు వేశారని.. అందుకే దానికి ఆ పేరు పెట్టామని నిర్వాహకులు చెబుతున్నారు.
bcci | delhi-high-court | Delhi Press Patra Prakashan | IPL 2025 | Champak | Robotic dog