/rtv/media/media_files/2025/08/24/hyd-2025-08-24-07-15-43.jpg)
Medchal Wife and Husband Murder
Hyderabad Crime: హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను చంపేసి ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడో భర్త.(Medchal Wife and Husband Murder) ఇంత దారుణమైన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీహిల్స్‌లో జరిగింది. బాధితురాలు గర్భవతి కావడం గమనార్హం. భార్యను ముక్కలు ముక్కులుగా నరికేసిన అనంతరం.. ఆమెబాడీ పార్ట్స్ ను కవర్‌లో ప్యాక్ చేసి.. కవర్‌ను బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే రూమ్ నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూడటంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడైన మహేందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి, మహేందర్ ప్రేమవివాహం చేసుకొని బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : GPT‑4b micro: ఇక మనిషికి చావు ఉండదా?.. వృద్ధులను యువకులుగా మార్చేయనున్న AI
మీర్ పేట్ లో దారుణం
హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో జరిగిన ఒక అత్యంత దారుణమైన హత్య కేసులో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య వెంకట మాధవిని చంపి, ఆమె శరీర భాగాలను ముక్కలు చేసి చెరువులో పారేసాడు. 2025జనవరిలో, హైదరాబాదులోని మీర్‌పేట్, జిల్లెలగూడలో నివసించే గురుమూర్తి (39), తన భార్య వెంకట మాధవి (35)ను దారుణంగా హత్య చేశాడు. మాధవి తల్లి జనవరి 18న తన కూతురు కనపడటం లేదని మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల దర్యాప్తులో గురుమూర్తి పక్కా ప్రణాళికతోనే ఈ హత్య చేశాడని తేలింది. సంక్రాంతి పండుగకు గురుమూర్తి, మాధవి తమ ఇద్దరు పిల్లలను గురుమూర్తి సోదరి ఇంటి వద్ద ఉంచి, తాము మాత్రమే ఇంటికి తిరిగి వచ్చారు. జనవరి 16న ఉదయం మాధవితో గొడవపడిన గురుమూర్తి, ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. దాంతో ఆమె కిందపడిపోయింది. అనంతరం గొంతు నులిమి చంపేశాడు.
Also Read : Good News: ఫ్యాన్స్ పండుగ చేసుకోండి..2027 వరల్డ్ కప్ వరకు విరాట్ , రోహిత్ ఆడ్డం పక్కా
శరీరాన్ని నాలుగు భాగాలుగా ముక్కలు చేసి
హత్య తర్వాత, మృతదేహాన్ని ముక్కలు చేసి పారేయాలని గురుమూర్తి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆమె శరీరాన్ని నాలుగు భాగాలుగా ముక్కలు చేశాడు. అంతేకాకుండా, శరీర భాగాలను మరిగే నీటిలో ఉడకబెట్టాడు. తరువాత కొన్ని భాగాలను స్టవ్‌పై పెట్టి కాల్చాడు. భార్యకు ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే గురుమూర్తి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేసి విచారించగా, అతను నేరాన్ని అంగీకరించాడు. అయితే, పోలీసులు ఇంతవరకు మాధవి శరీర భాగాలను పూర్తిగా గుర్తించలేకపోయారు.
Also Read : kukatpally: సహస్ర హత్య కేసు.. స్నానం చేసి తల్లికి దొరికిపోయిన 14 ఏళ్ల బాలుడు!