/rtv/media/media_files/2025/08/24/sahasra-2025-08-24-06-49-39.jpg)
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో నివసించే 10 ఏళ్ల బాలిక సహస్రను ఓ బాలుడు దారుణంగా హతమార్చాడు. క్రికెట్ బ్యాట్ కోసమని బాలిక ఇంటికి వచ్చిన 14 ఏళ్ల మైనర్ బాలుడు బ్యాట్ దొంగిలిస్తుండగా సహస్ర చూసిందని, ఆమె అరవడంతో భయపడి ఆ బాలుడు ఆమెను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే హత్య చేసిన అనంతరం బాలుడు చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. ప్రతిరోజు ఎన్నోసార్లు మందలిస్తే తప్ప స్నానం చేయని తన కొడుకు. బాలిక హత్య జరిగిన రోజు ఉదయం 10:30కే స్నానం చేయడంతో తాను ఆశ్చర్యపోయానని బాలుడి తల్లి పోలీసులకు వెల్లడించారు.
హత్య జరిగిన రోజు టెన్షన్ గా
అప్పుడే తనలో అనుమానం మొదలైందని వెల్లడించింది.అంతేకాకుండా హత్య జరిగిన రోజు తన కొడుకు టెన్షన్ గా ఉండటాన్ని తాను గమనించానని పోలీసులకు చెప్పింది. దీంతో రెండు రోజులపాటు కొడుకు కదలికలపై కన్నేసనని తెలిపింది. ఘటనాస్థలికి పోలీసులు వచ్చినప్పుడల్లా అక్కడ జరిగేది తెలుసుకొని రావడం.. తన ఇంట్లో వాళ్లనూ ఆ వివరాలు అడుగుతుండటంతో మరింత అనుమానం పెరిగిందంది. ఎందుకురా ఇలా ఆ వివరాలన్నీ అడుగుతున్నావ్.. ఆ పిల్లను నువ్వేమైనా చంపావా? అని తాను గట్టిగా ప్రశ్నిస్తే.. 'అమ్మతోడమ్మ.. నేనేమీ చేయలేదు. ఎందుకు అనుమానిస్తున్నావ్.. నువ్వే నన్ను పోలీసులకు పట్టించేలా ఉన్నావ్' అంటూ తన కొడుకుబెదిరిపోయినట్లు మాట్లాడాడని పోలీసులకు చెప్పింది.
Also Read : Crime News: నాన్నే అమ్మను తగలబెట్టాడు...సంచలనంగా మారిన పసివాని సాక్ష్యం
ఎలా సెల్ ఫోన్ కొన్నావని అడిగితే
తన కొడుకు ఇటీవల సెల్ ఫోన్ కొన్నాడని, ఇంట్లో వాళ్లు డబ్బు ఇవ్వకుండా ఎలా సెల్ ఫోన్ కొన్నావని అడిగితే నీకెందుకు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని, ఆ రోజే నిలదీసి ఉంటే ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదని వాపోయింది. మరోవైపు ఈ కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని సహస్ర తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి చంపాడనే పోలీసుల వాదనను వారు ఖండించారు. నిందితుడు మైనర్ కాబట్టి కఠిన శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందని వారు మండిపడ్డారు.ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని సహస్ర కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కూడా నిర్వహించారు. ఈ ఘటనతో సహస్ర కుటుంబంతో పాటు స్థానికులు కూడా తీవ్రంగా కలత చెందారు.
మరోవైపు, సహస్ర తల్లి రేవతి మీడియాతో మాట్లాడుతూ, నిందితుడి తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "తమ కొడుకు ఏం చేస్తున్నాడో వారికి తెలియదా?" అని ప్రశ్నించారు. అలాగే, నిందితుడి తల్లి సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తుందని, తండ్రి ఏ పనీ చేయడం లేదని చెప్పింది.
Also Read : SUPER: ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా వినాయకుడు.. ఆపరేషన్ సింధూర్ గణపతిని చూడండి (VIDEO)