SUPER: ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా వినాయకుడు.. ఆపరేషన్ సింధూర్‌ గణపతిని చూడండి (VIDEO)

గణేశ్ చతుర్థి ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో గణపతి విగ్రహాలను వినూత్నంగా ప్రతిష్టిస్తున్నారు. ఈ క్రమంలో, ఉప్పుగూడలోని శ్రీ మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ 'ఆపరేషన్ సింధూర్' థీమ్‌తో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

New Update
Ganpati idol in Operation Sindoor theme

Ganpati idol in Operation Sindoor theme

గణేశ్ చతుర్థికి హైదరాబాద్ ముస్తాబవుతోంది. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో గణపతి విగ్రహాలను వినూత్నంగా ప్రతిష్టిస్తున్నారు. ఈ క్రమంలో, ఉప్పుగూడలోని శ్రీ మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ 'ఆపరేషన్ సింధూర్' థీమ్‌తో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ థీమ్ ఇండియన్ ఆర్మీ శౌర్యం, బలాన్ని ప్రతిబింబిస్తుంది.

సైనిక దుస్తుల్లో గణపతి:

సుమారు రూ.6 లక్షల వ్యయంతో స్థానిక కళాకారులు ఈ ప్రత్యేకమైన విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహంలో గణేశుడు ఎయిర్ ఫోర్స్ అధికారిగా దర్శనమిస్తారు. ఆయన చుట్టూ బ్రహ్మోస్ క్షిపణులు, S-400 రైఫిల్స్, సైనిక మోడళ్లు వంటివి ఏర్పాటు చేశారు. దేశ భద్రత కోసం మన సైనికులు చేస్తున్న కృషి, త్యాగాలను స్మరించుకునేందుకు ఈ థీమ్‌ను ఎంచుకున్నామని నిర్వాహకులు తెలిపారు. పండగ రోజులలో దేశభక్తిని, సైనికుల పోరాటాలను ప్రజలకు తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశం అని వారు పేర్కొన్నారు.

దేశభక్తి, వినోదం:

ఆపరేషన్ సింధూర్ గురించి భక్తులకు అవగాహన కల్పించేందుకు 20 నిమిషాల షార్ట్ ఫిల్మ్ కూడా కూడా రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో ఈ వీడియోను ప్రదర్శించనున్నారు. 2023లో చంద్రయాన్ థీమ్‌తో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలను ఆకట్టుకున్నామని, ఈసారి కూడా ప్రత్యేక థీమ్‌తో భక్తులను ఆకర్షించనున్నట్లు వారు చెప్పారు.

కళాకారుల కృషి:
ఈ విగ్రహాన్ని రూపొందించడానికి సుమారు 50 రోజులు పట్టిందని, 10 మందికి పైగా కళాకారులు పగలూ రాత్రి శ్రమించి దీనిని పూర్తి చేశారని నిర్వాహకులు వెల్లడించారు. ఈ థీమ్ యువతలో దేశభక్తిని ప్రేరేపించడంతో పాటు, సైనిక శక్తి గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో సహాయపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు కేవలం మతపరమైన వేడుకలు కాకుండా, సామాజిక అంశాలను, జాతీయ విజయాలను ప్రదర్శించే వేదికలుగా మారుతున్నాయి. ఉప్పుగూడలోని ఈ గణపతి విగ్రహం కూడా ఆ కోవలోకి వస్తుంది.

Advertisment
తాజా కథనాలు