ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్.. షూటింగ్ డేట్ ఫిక్స్?

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పటివరకు తాను తీసిన చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని, మరో ఆరు నెలల్లో షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు తెలిపారు.

New Update
ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్.. షూటింగ్ డేట్ ఫిక్స్?

Jr NTR And Prashanth Neel Movie Crazy Update : టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్‌ (NTR), స్టార్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel)కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తికగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకోసం క్రేజీ అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు. ఈ మేరకు రీసెంట్ గా ఓ సమావేవంలో పాల్గొన్న ప్రశాంత్ నీల్.. ఇప్పటి వరకు తాను తీసిన చిత్రాలకు అది విభిన్నంగా ఉంటుందని చెప్పారు. అయితే ఆ కథ ఏ నేపథ్యంలో సాగుతుందనే విషయం మాత్రం వెల్లడించలేదు. ప్రేక్షకులు యాక్షన్‌ చిత్రమని భావిస్తున్నారని, జానర్‌ ఏదైనా అది వారికి బాగా కనెక్ట్‌ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

publive-image

ఈ మేరకు వచ్చే ఏడాది ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ‘కేజీయఫ్‌ 3’ (KGF 3) గురించి మాట్లాడుతూ.. ‘‘ఆ సినిమా తప్పక ఉంటుంది. స్క్రిప్టు సిద్ధమైంది. సీక్వెల్‌ చేయాలనే ఆలోచనతోనే ‘కేజీయఫ్‌ 2’ (KGF)ఎండింగ్‌లో హింట్‌ ఇచ్చాం’’ అని తెలిపారు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయనతో ఓ సినిమా చేయాలనుందని మనసులో మాట బయటపెట్టారు. ‘సలార్‌ పార్ట్‌ 1- సీజ్‌ఫైర్‌’ (Salaar: Part 1- Ceasefire)త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ సంగతులు పంచుకున్నారు. ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘సలార్‌’. శ్రుతి హాసన్‌ కథానాయిక. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తొలి భాగం డిసెంబరు 22న విడుదల కానుంది.

Also read :డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన ప్రియాంక.. ఏమన్నారంటే

ఇక ‘కేజీయఫ్‌ 1’, ‘కేజీయఫ్‌ 2’ చిత్రాలతో ఈ దర్శకుడు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘన విజయాల తర్వాత దర్శకత్వం వహించిన సినిమాకావడంతో ‘సలార్‌’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లోనే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారాయన. #NTR31, #NTRNEEL అనేవి వర్కింగ్‌ టైటిల్స్‌గా ఉన్నాయి. ప్రస్తుతం శివ కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ‘దేవర’లో నటిస్తుండగా ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్‌ 5న విడుదలకానుంది.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Deepika Padukone: ప్రభాస్ ‘కల్కి 2’ నుంచి దీపికా అవుట్.. షాకింగ్ పోస్ట్!

దీపికా పదుకొనేకు బిగ్‌షాక్ తగిలింది. ‘కల్కి 2’ సినిమా నుంచి ఆమెను తొలగించినట్లు ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన బిడ్డ కోసం వర్కింగ్ హవర్స్ అడ్జస్ట్ చేయాలని దీపిక రిక్వెస్ట్ చేసిందని, సెట్ కాకపోవడంతో రీప్లేస్మెంట్ కోసం చూస్తున్నట్లు టాక్.

New Update
deepika padukone exit from prabhas and nag ashwin kalki 2 movie

deepika padukone exit from prabhas and nag ashwin kalki 2 movie

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించింతో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం దాదాపు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటించి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్‌గా కూడా మరో పార్ట్ రాబోతుంది. 

ఈ సారి ‘కల్కి 2’లో అందరి పాత్రలు మరింత పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు మేకర్స్ ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సీక్వెల్ మూవీ నుంచి దీపికా పదుకొనేను తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఏమైంది? అంటూ నెట్టింట ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

Also Read: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు

‘కల్కి2’ నుంచి దీపికా అవుట్

ఇదిలా ఉంటే వర్కింగ్ హవర్స్ అడ్జస్ట్‌మెంట్, హై రెమ్యూనరేషన్ కారణంగా దీపికా పదుకొనేను ఇటీవల సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ నుంచి తొలగించారు. ఈ విషయంలో ఆ మధ్య సందీప్ - దీపిక మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అది మరువక ముందే ఇప్పుడు దీపికను ‘కల్కి 2’ నుంచి తొలగించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ పోస్టు వైరల్‌గా మారింది. 

బాలీవుడ్ మీడియా ప్రకారం.. ‘‘కల్కి 2’లో దీపిక పదుకొనే ఉండదని సమాచారం. తన బిడ్డ కోసం వర్కింగ్ హవర్స్ అడ్జస్ట్ చేయాలని మేకర్స్‌ని దీపిక చాలా రిక్వెస్ట్ చేసిందని.. కానీ అది సెట్ కాకపోవడంతో రీప్లేస్మెంట్ కోసం చూస్తున్నట్లు ఆ పోస్టులో రాసి ఉంది. దీంతో దీపికా పదుకొనే ప్లేస్‌లో మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్‌ కోసం మేకర్స్ వెతుకుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై అటు మేకర్స్, కానీ దీపిక పదుకొనే కానీ ఇప్పటి ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం ఆ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. 

Also Read: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్‌పై స్టాలిన్‌ సంచలన ఆరోపణలు

Advertisment
Advertisment