Allu Arvind: ఇండస్ట్రీలో స్టార్ హీరోల రెమ్యునరేషన్ ప్రతిసారీ అదొక బర్నింగ్ టాపిక్. సినిమా బడ్జెట్లో సగం మొత్తాన్ని ‘స్టార్ హీరో- స్టార్ డైరెక్టర్’ జోడీకి పారితోషికంగా చెల్లిస్తుంటే, ఇక సినిమా మేకింగ్ కోసం నిర్మాత ఎక్కడి నుంచి డబ్బు తేగలడు? అంటూ చాలా విమర్శలు ఉన్నాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు జీవించి ఉన్న రోజుల్లో హీరోలు, దర్శకులు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని డిమాండ్ చేసేవారు. కానీ,ఆ పరిస్థితి ఇప్పటికీ మారలేదు సరికదా.. స్టార్ హీరోలు ఇప్పుడు అందనంత ఎత్తులో ఉన్నారు. అందుకే ఇటీవల చాలా కాలంగా సినిమాల బడ్జెట్లు పెరగడం చర్చనీయాంశమైంది. అయితే ఇలా పెరగడానికి హీరోనే కారణం అని అంటే మాత్రం, తెలుగు ఇండస్ట్రీలోని పెద్ద నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ఒప్పుకోవడం లేదు.
పూర్తిగా చదవండి..KGF లేకపోతే యశ్ ఎవరు?..అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు.!
నిర్మాణ వ్యయం వల్లే తాను పెద్ద సినిమాలకు దూరంగా ఉన్నానని టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. కెజిఎఫ్ రాకముందు యశ్ ఎవరు..? ఎంత పెద్ద హీరో అతను? సినిమాను పెద్దగా చూపించారు కాబట్టే KGF సినిమా ఆడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Translate this News: