నిన్నటి దాకా మోడీపై మొరిగిన సీఎంలు ఇప్పుడు.... సీపీఐ నారాయణ ఫైర్...!

వైసీపీ, బీజేపీలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ వైసీపీ పేర్లు వేరుగా ఉన్నా రెండు పార్టీలు ఒకటేనన్నారు. ఏపీలో మోడీ దత్త పుత్రుడుగా జగన్ వ్యవహరిస్తున్నాడంటూ మండిపడ్డారు. డబుల్ ఇంజన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం విధానం ప్రకటించిందన్నారు. ఫెడరల్ వ్యవస్థను నాశనం చేసేందుకే ఈ డబుల్ ఇంజన్ విధానం ప్రవేశ పెట్టారన్నారు.

నిన్నటి దాకా మోడీపై మొరిగిన సీఎంలు ఇప్పుడు.... సీపీఐ నారాయణ ఫైర్...!
New Update

వైసీపీ, బీజేపీలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ వైసీపీ పేర్లు వేరుగా ఉన్నా రెండు పార్టీలు ఒకటేనన్నారు. ఏపీలో మోడీ దత్త పుత్రుడుగా జగన్ వ్యవహరిస్తున్నాడంటూ మండిపడ్డారు. డబుల్ ఇంజన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం విధానం ప్రకటించిందన్నారు. ఫెడరల్ వ్యవస్థను నాశనం చేసేందుకే ఈ డబుల్ ఇంజన్ విధానం ప్రవేశ పెట్టారన్నారు.

సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర గుంటూరుకు చేరుకుంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఇటు ఏపీలో కూడా డబుల్ ఇంజన్ విధానం నడుస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, బీఆర్ఎస్ ముసుగులో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందన్నారు. నిన్న మొన్నటి దాకా ప్రధాని మోడీ పై రెండు రాష్ట్రాల సీఎంలు విమర్శలు గుప్పించారని అన్నారు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు సీఎంలు బీజేపీకి అనుకూలంగా మారిపోయారని ఫైర్ అయ్యారు.

కూతురు కవిత కోసం సీఎం కేసీఆర్ బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. అందుకే లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్టు నిలిచి పోయిందని చెప్పారు. ఇక ఎన్నికల్లో గెలిస్తే మోడీ మెడలు వంచుతామని గతంలో ప్రగల్బాలు పలికారన్నారు. ఆ తర్వాత కేసులకు భయపడి మోడీ ముందు సీఎం జగన్ లొంగి పోయాడని విమర్శలు గుప్పించారు.

వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని రక్షించేందుకే మోడీ సర్కార్ కు జగన్ లొంగిపోయారని మండిపడ్డారు. ప్రస్తుతానికి జనసేన చీఫ్ కాషాయ పార్టీతో అంట కాగుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఆ రెండు పార్టీలు కలిసి వుంటాయా అనేది ప్రశ్నార్థకమేనన్నారు. ప్రజా చైతన్య యాత్రలు చేసి సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత మనమీద ఉంది.

#cpi #avinash-reddy #bjp #kavitha #brs #ycp #kcr #narayana #cm-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe