Madhu Yashki: చంద్రబాబు అరెప్ట్‌పై కాంగ్రెస్‌ నేత మధు యాష్కి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు అరెస్ట్‌పై టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ వెనుక సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారన్నారు. దీని వెనుక ఉన్న కేసీఆర్‌, మోడీ పాత్రలపై తమ వద్ద పూర్తిస్థాయి సమాచారం ఉందన్నారు.

Lok Sabha Elections: కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ ఇంట్లో తనిఖీలు
New Update

చంద్రబాబు అరెస్ట్‌పై టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ వెనుక సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారన్నారు. దీని వెనుక ఉన్న కేసీఆర్‌, మోడీ పాత్రలపై తమ వద్ద పూర్తిస్థాయి సమాచారం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో బీజేపీకి వ్యతిరేకంగా పని చేశాడని గుర్తు చేసిన మధు యాష్కీ.. అందుకే ప్రధాని కేసీఆర్‌తో కలిసి చంద్రబాబును జైలుకు పంపించారన్నారు. అంతే కాకుండా బాబుకు బెయిల్‌ కూడా రాకుండా ఇరువురు నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు.

కాగా చంద్రబాబు అరెస్ట్‌పై ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. అంతే కాకుండా ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్‌లో సెటిలైన వారు చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీ తీసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. ఈ ర్యాలీలో ఎల్భీనగర్‌ ఎమ్మెల్యే ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించారు. వారి ఓట్ల కోసమే ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి మేకతోలు కప్పుకున్న పులిలా వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుధీర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచింది కాంగ్రెస్‌ పార్టీ, చంద్రబాబు దయతోనే అన్నారు.

మరోవైపు లిక్కర్‌ స్కామ్‌పై మాట్లాడిన ఆయన.. ఈ స్కామ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను లిక్కర్‌ స్కామ్‌లో ఇరికించి అరెస్ట్‌ చేయించారన్నారు. ఇప్పుడు చంద్రబాబును సైతం అరెస్ట్‌ చేయించి జైల్లో కూర్చోబెట్టారన్నారు. మరి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్‌ చేయలేదో ప్రధాని చెప్పాలని మధు యాష్కీ ప్రశ్నించారు. నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ నడుస్తున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Also read: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు తోడు దొంగలు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

#brs #kcr #congress #ycp #chandrababu #jagan #bjp #narendra-modi #madhu-yashki #arept
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe