CM Revanth Reddy : అన్నా అని పిలిచింది..నేనున్నా అంటూ ఆపన్న హస్తం ఇచ్చిన సీఎం రేవంత్

అన్నా అని పిలవండి ఎక్కుడున్నా పరుగెట్టుకుని వస్తా..ఇదీ ప్రమాణం చేసిన మరుక్షణం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట. నిన్న ఆసుపత్రిలో కేసీఆర్ ను కలిసిన తర్వాత అన్నా అని పిలిచిన మహిళకు వెంటనే సాయం అందే ఏర్పాట్లు చేసి శభాష్ అనిపించుకున్నారు రేవంత్ రెడ్డి.

New Update
CM Revanth Reddy : అన్నా అని పిలిచింది..నేనున్నా అంటూ ఆపన్న హస్తం ఇచ్చిన సీఎం రేవంత్

Telangana CM Revanth : మేం పాలకులం కాదు...సేవకులం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాదు రేవంత్ అన్న అని పిలిపించుకుంటా అని చెప్పారు. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన దగ్గర నుంచీ చేసిన వాగ్దానాలను తీర్చుకుంటూ వస్తూ...ప్రజల్లో ఉంటున్న రేవంత్ రెడ్డి మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. నిన్న కేసీఆర్(KCR) ను పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి వెళ్ళారు రేవంత్. అక్కడ ఆయన్ని కలిసి వచ్చేస్తుంటే...ఒక మహిళ అన్నా అని పిలిచింది. మీతో ఒకసారి మాట్లాడాలి అని అడిగింది. ఆమె ఒక్కసారి అన్నా అని పిలవగానే టక్కున ఆగిపోయారు సీఎం. వెంటనే దగ్గరకు వెళ్ళి ఏమైందని అడిగారు. యువతి వాళ్ళ నాన్నకు ఆసుపత్రిలో అయిన ఖర్చు గురించి చెబితే...వెంటనే తన టీమ్ కు చెప్పి వివరాలు కనుక్కుని సాయం అందించండి అంటూ ఆర్డర్ వేశారు రేవంత్.

Also Read : పవన్‌ కళ్యాణ్‌పై కిషన్‌ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి..

ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ పాపులర్ అవుతోంది. బాధపడకు తల్లీ...ధైర్యంగా ఉండు అంటూ సీఎం రేవంత్ ఇచ్చిన భరోసా అందరి మన్ననలనూ పొందుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రేవంత్ ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అలాగే ఇది మూన్నాళ్ళ ముచ్చట కాకుండా ఉండేలా చూసుకోమని కూడా చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు