Kishan Reddy : తెలంగాణ(Telangana) లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP)తో కలిసి జనసేన పోటీ చేసిన సంగతి తెలసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బీజేపీ నేతలతో కలిసి ప్రచారం చేశారు. 8 చోట్ల పోటీ చేసిన జనసేన ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కిషన్ రెడ్డి స్పందించారు. ‘ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ నిర్ణయం రెండు పార్టీలు ఆలోచించి తీసుకున్నదే. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే మేము జనసేనతో కలిసి బరిలో దిగాం.
పూర్తిగా చదవండి..Central Minister : పవన్ కళ్యాణ్‌పై కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన కిషన్‌రెడ్డి ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఇలా ప్రచారం చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
Translate this News: