Sonia Gandhi: సోనియా గాంధీని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలిసారిగా కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీని కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆమెను రేవంత్ భట్టి కోరారు. By Bhavana 05 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy Met Sonia Gandhi : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తొలిసారిగా కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీని కలిశారు. తెలంగాణలో జరుగుతున్న పాలన గురించి వారు సోనియాకు వివరించారు. ఈ క్రమంలోనే రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆమెను రేవంత్ భట్టి కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) కింద మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) , రాజీవ్ ఆరోగ్య శ్రీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రూ.500లకు గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. కొన్ని నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం (Khammam) నుంచి ఆమె బరిలో నిలిచేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో ఇప్పట్లో కోలుకోలేదు. బీజేపీకి కూడా డిపాజిట్లు లేవు. దీంతో కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ఉంటుందని వామపక్షాలు పేర్కొంటున్నాయి. అందుకే సోనియా ఖమ్మం నుంచి పోటీ చేస్తే చాలా ఈజీగా గెలవచ్చని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఖమ్మం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు సీట్లు, మిత్రపక్షం సీపీఐ ఓ సీటులో విజయం సాధించాయి. ఈ ఏడు సీట్లలో కూడా మొత్తం 30 వేలకు పైగా మెజార్టీ సాధించారు. దీంతో కాంగ్రెస్ కంచుకోటగా ఖమ్మం మారిందని రాజకీయ సమీకరణాలు చెబుతున్నాయి. Also read: మైలవరంలో దేవినేని ఉమాకు షాక్..వసంతకు అక్కడ నుంచే టీడీపీ టికెట్? #congress #bhatti-vikramarka #telangana #cm-revanth-reddy #khammam #politics #sonia-gandhi #revanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి