CPI: ప్రభుత్వమే సిగ్గులేకుండా 'పుష్ప'ను ప్రోత్సహించింది.. నారాయణ!
బెనిఫిట్ షో టికెట్ల ధరలు పెంచేందుకు పర్మిషన్ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వమే 'పుష్ప' సినిమాను ప్రోత్సహించిందని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. స్మగ్లింగ్ తోపాటు అసభ్యకరమైన పాటలున్న సినిమాకు సిగ్గులేకుండా అనుమతి ఇచ్చిందని విమర్శించారు.