సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్‌ని పొగిడిన పూనమ్ కౌర్!

సంధ్య థియేటర్ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ తరుణంలో నటి పూనమ్ కౌర్ బన్నీని పొగుడుతూ ట్వీట్ చేసింది. పుష్ప2 సినిమా ఇప్పుడే చూశానంది. గంగమ్మ జాతర ఎపిసోడ్ అద్భుతంగా ఉందని.. అందులో అల్లు అర్జున్‌ని మించిన ప్రతిభను ఊహించలేమని ప్రశంసించింది.

New Update
POONAM KOUR

ALLU ARJUN Photograph: (Sandhya Theatre)

సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ వైడ్‌గా సంచలనం సృష్టిస్తోంది. అల్లు అర్జున్‌పై భారీ నెగిటివిటీ వస్తోంది. అతడి వల్లే రేవతి చనిపోయిందంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. 

మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం అల్లు అర్జునే సంధ్య థియేటర్‌లో తొక్కిసలాటకు కారణం అని అన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో నటి పూనమ్ కౌర్ బన్నీని పొగడటం అందరినీ షాక్ గురిచేస్తోంది.

Also Read :  ఆసియా కప్ మనదే.. దుమ్ము దులిపేసిన టీమిండియా మహిళా క్రికెటర్లు

జాతర ఎపిసోడ్ అదిరిపోయింది

ట్విట్టర్ వేదికగా స్పందించిన నటి పూనమ్ పుష్ప2 సినిమా చూసినట్లు పేర్కొంది. దీనిపై తన రివ్యూ కూడా ఇచ్చింది. ‘‘ఇప్పుడే పుష్పరాజ్ సినిమా చూడటం పూర్తయింది. 

గంగమ్మ జాతర ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది. ఆ సన్నివేశాలు తెలంగాణలోని సమ్మక్క సారక్క సంస్కృతిని గుర్తుచేశాయి. అందులో అల్లు అర్జున్‌ని మించిన ప్రతిభను ఊహించలేము. 

మన అచ్చమైన భారతీయతను ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు మేకర్స్‌కి ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

అల్లు అర్జున్ ఇంటిపై దాడి

ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఓయూ జేఏసీ అల్లు అర్జున్‌ ఇంటిని ముట్టడించింది. పలువురు జేఏసీ నాయకులు బన్నీ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు.

ఇది కూడా చదవండి: రాహుల్‌గాంధీకి బిగ్ షాక్.. యూపీ కోర్టు సమన్లు

బాడీగార్డ్‌లు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై కొందరు తిరగబడ్డారు. అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయిందంటూ వారు ఆరోపిస్తున్నారు. వెంటనే రేవతి కుటుంబానికి బన్నీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి

అంతేకాకుండా రేవతి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ కుటుంబానికి అన్ని విధాల ఆదుకోవాలని జేఏసీ నాయకులు కోరుతున్నారు. ఇక విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకి చేరుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు