/rtv/media/media_files/2024/12/22/jofgNSt3j3LstDIeDeo4.jpg)
balayya venkatesh at unstoppable
టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలకృష్ణ, వెంకటేష్.. చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటికొచ్చాయి. అన్ స్టాపబుల్ షో ఇందుకు వేదికైంది.
బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఆహాలో భారీ వ్యూస్ రాబడుతోన్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో ఇప్పటికే పలు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవ్వగా.. లేటెస్ట్ ఎపిసోడ్ లో వెంకీమామ సందడి చేయనున్నాడు.
Also Read : 'గేమ్ ఛేంజర్' చూసి షాకింగ్ రివ్యూ ఇచ్చిన సుకుమార్..!
Victory and the God of Masses together 🔥🔥🔥 Sankranti heroes, unstoppable energy, and ultimate entertainment.#UnstoppableWithNBKS4 #Aha #NandamuriBalakrishna #VenkateshDaggubati #aha #UnstoppableS4 #NBK #Sankranthi @VenkyMama pic.twitter.com/fqvT2xlse7
— ahavideoin (@ahavideoIN) December 22, 2024
Also Read : ఆసియా కప్ మనదే.. దుమ్ము దులిపేసిన టీమిండియా మహిళా క్రికెటర్లు
Venkatesh - Balakrishna Unstoppable 4 Show
తన కొత్త సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ బాలయ్య అన్‌స్టాపబుల్ కి గెస్ట్ గా వచ్చారు. నేడు వెంకిమామ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది.
ఈ ఎపిసోడ్ కి అనిల్ రావిపూడి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. తాజగా షూటింగ్ అయిపోవడంతో షూట్ లో తీసిన పలు ఫోటోలను ఆహా టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫొటోల్లో బాలయ్య, వెంకటేష్ లను చూస్తుంటే ఈ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుందని అర్థమైపోతుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ తో పాటూ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి: రాహుల్‌గాంధీకి బిగ్ షాక్.. యూపీ కోర్టు సమన్లు
ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జనవరి 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : పాప్‌కార్న్ ప్రియులకు బిగ్ షాక్.. రుచిని బట్టి 3రకాల GST!