/rtv/media/media_files/2024/12/22/peolx9sbhNLFbq57pS4W.jpg)
jagapathi babu on sandhya theatre issue file photo
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా ఎలాంటి సంచలనానికి తెరలేపిందో తెలిసిందే. ఈ ఘటనకుసంబంధించి.. సినిమా వాళ్లు ఏ ఒక్కరూ బాధిత కుటుంబాన్ని పరామర్శించట్లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీనియర్ నటుడు జగపతి బాబు దీనిపై స్పందించారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో జగపతి బాబు మాట్లాడుతూ..' సినిమా షూటింగ్ ముగించుకుని నేను ఊరి నుంచి రాగానే.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హాస్పిటల్‌కు వెళ్లా. చికిత్స పొందుతున్న బాలుడి తండ్రిని, సోదరిని పలకరించాలని అనిపించి అక్కడకు వెళ్లా.
— Jaggu Bhai (@IamJagguBhai) December 22, 2024
అందరి ఆశీస్సులతో త్వరగానే కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ కుటుంబం కాబట్టి నా వంతు సపోర్టు ఇవ్వాలనుకున్నా. దానికి పబ్లిసిటీ చేయలేదు. అందుకే ఎవరికీ ఆ విషయం తెలియలేదు. దానిపై క్లారిటీ ఇవ్వడానికే ఈ పోస్టు..' అని పేర్కొన్నారు.
పుష్ప 2’ ప్రీమియర్ షో చూసేందుకు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సంబంధిత కేసులో అల్లు అర్జున్ ఇటీవల అరెస్టు అయి బెయిల్‌పై విడుదలయ్యారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాగా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సినీ ప్రముఖుల్లో జగపతి బాబు మొదటి వ్యక్తి కావడం గమనార్హం.