Thandel Movie: ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో 'తండేల్' పైరసీ.. విచారణకు ఆదేశించిన సంస్థ ఛైర్మన్
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో 'తండేల్' పైరసీ కాపీని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మూవీ నిర్మాతలు దీనిపై చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు సమర్పించాలని ఛైర్మన్ ఆదేశించారు.