/rtv/media/media_files/2025/02/11/p1c8Udta0yeQAsmElssy.jpg)
vennela kishore
Vennela Kishore: సంజీవ్‌రెడ్డి దర్శకత్వంలో యంగ్ బ్యూటీ చాందినీ చౌదరీ, విక్రాంత్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సంతాన ప్రాప్తిరస్తూ. మధుర ఎంటర్‌టైన్‌మెంట్ నిర్వి ఆర్ట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా మేకర్స్ ఈమూవీ నుంచి వెన్నెల కిషోర్ పాత్రను రివీల్ చేశారు.
Also Read: తండేల్ సక్సెస్ సెలబ్రేషన్స్ కు నాగార్జున.. అదిరిపోయేలా ప్లాన్ చేసిన అల్లు అరవింద్!
Meet the Entertainer @VennelaKishore as Dr. Bhramaram from Gharbha Gudi Wellness Centre🩺🤩
— Madhura Sreedhar Reddy (@madhurasreedhar) February 10, 2025
A doctor who blends science, Ayurveda, and a big dose of laughter in the world of #SanthanaPrapthirasthu 👶❤️🔥@ThisIsVikranth @iChandiniC @sanjeevflicks @madhurasreedhar… pic.twitter.com/t0Yv299ZGc
డాక్టర్ భ్రమరం ..
ఇందులో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ డాక్టర్ భ్రమరం పాత్రలో కనిపించబోతున్నట్లు తెలియజేశారు. ''మీట్ ఎంటర్టైనర్ వెన్నెల కిషోర్ డాక్టర్ భ్రమరం ఫర్మ్ గర్భగుడి వెల్నెస్ సెంటర్'' అంటూ ఎక్స్ లో పోస్టర్ షేర్ చేశారు. మూవీలో వెన్నెల కిషోర్ డైలాగ్ టైమింగ్, కామెడీతో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తారని మేకర్స్ చెబుతున్నారు. హాస్యం, భావోద్వేగాలు, నిజ జీవిత క్షణాలను మిళితం చేస్తూ పరిపూర్ణమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'సంతన ప్రాప్తిరస్తు' రూపొందుతోంది.
'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' , 'ఏక్ మినీ కథ' చిత్రాల ఫేమ్ షేక్ దావూద్ జీ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. అభినవ్ గోమటం , మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇది ఇలా ఉంటే వెన్నెల కిషోర్ లెజండ్రీ కమెడియన్ బ్రహ్మానందంతో కలిసి 'బ్రహ్మ ఆనందం' అనే మరో సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి రాబోతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
Also Read: Thandel Movie: ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో 'తండేల్' పైరసీ.. విచారణకు ఆదేశించిన సంస్థ ఛైర్మన్