Thandel Movie: ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులో 'తండేల్' పైరసీ.. విచారణకు ఆదేశించిన సంస్థ ఛైర్మన్‌

ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులో 'తండేల్' పైరసీ కాపీని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మూవీ నిర్మాతలు దీనిపై చర్యలు తీసుకోవాలని ఏపీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు సమర్పించాలని ఛైర్మన్‌ ఆదేశించారు.

New Update
thandel piracy

thandel piracy

Thandel Movie:  ఫిబ్రవరి 7న విడుదలైన  నాగచైతన్య- సాయి పల్లవి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్  'తండేల్' సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా జోరు ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజైన రోజు నుంచే సోషల్ మీడియాలో HD ప్రింట్ తో పైరసీ కాపీలు వైరల్ కావడం ఇండస్ట్రీలో  హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులో  కూడా  సినిమాను ప్రదర్శించడం  చర్చనీయాంశమైంది. దీంతో ఈ ఘటనకు పాల్పడిన వారిపై  కఠిన  చర్యలు తీసుకోవాలని నిర్మాత బన్నీ వాసు ఏపీఎస్ ఆర్టీసీ  ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. 

ఇది కూడా చూడండి:Uttarakhand:హీరోయిన్‌ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!

Also Read: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్‌ కంపెనీలు

విచారణకు ఆదేశించిన ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌

ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై స్పందించిన  ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు  విచారణకు ఆదేశించారు. పైరసీ ఘటనపై ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పైరసీ ఘటనకు సంబంధించి నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. పైరసీని ఎంకరేజ్ చేస్తున్న వారిపై మండిపడ్డారు. ఏకంగా బస్సుల్లో పైరసీ ప్రింట్ ప్రదర్శించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తెలిసి, మరికొందరు తెలియక సినిమాలను పైరసీ చేస్తున్నారు.. వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్స్  ఆ లింకులను షేర్ చేస్తున్నారు అని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని.. పైరసీని ప్రోత్సహిస్తున్న వారిని గుర్తించి కేసులు పెడతామని తెలిపారు.

Also Read: సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైలా ట్రెండింగ్.. వైసీపీతో పెట్టుకుంటే మాములుగా ఉండదుగా..

ఇది కూడా చూడండి:Telangana Beers : పెరిగిన బీర్ల ధరలు.. లైట్, స్ట్రాంగ్ ఎంత? .. ప్రభుత్వానికి ఎంత ఆదాయం ?

Advertisment
తాజా కథనాలు