Mandadi: సుహాస్‌ సినిమా షూటింగ్‌ లో ప్రమాదం.. సముద్రంలో మునిగిపోయిన పడవ (VIDEO)

నటుడు సుహాస్ నటిస్తున్న 'మందాడి' సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. సముద్రంలో సన్నివేశాల చిత్రీకరణ సమయంలో సాంకేతిక నిపుణులున్న పడవ బోల్తా పడింది. సిబ్బందిని రక్షించారు.. కానీ కోటి రూపాయల విలువైన కెమెరాలు, ఇతర సామాగ్రి నీట మునిగిపోయాయి.

New Update
mandadi movie shooting boat capsizes in sea

mandadi movie shooting boat capsizes in sea


టాలీవుడ్ నటుడు సుహాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించి తన నటనతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ‘కలర్ ఫొటో’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి.. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించాడు. ఇప్పుడు పలు భాషల్లో కూడా నటిస్తున్నాడు. 

mandadi movie shooting

ఇటీవలే తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ తమిళ నటుడు సూరి హీరోగా నటిస్తున్న ‘మండాడి’ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఇందులో సుహాస్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలు సన్నివేశాలను చిత్రీకరించారు. అందుకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. 

తాజాగా ఈ మూవీ బృందం ప్రమాదంలో పడింది. సినిమా షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ మూవీ షూటింగ్ తాజాగా చెన్నైలోని సముద్ర తీరంలో పడవపై కొన్ని సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్నికల్ బృందం ఉన్న పడవ సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగిపోయారు. కెమెరాలతో పాటు మరిన్ని సాంకేతిక పరికరాలు సైతం నీటిలో పడిపోయాయి. పడిపోయిన ఇద్దరినీ సినిమా యూనిట్ రక్షించగా.. కెమెరాలు, ఇతర వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంతో దాదాపు రూ.కోటి ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 

మాతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వెట్రిమారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందుతోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన టైంలో సుహాస్ అక్కడ ఉన్నాడా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై త్వరలో మూవీ యూనిట్ స్పందించాల్సి ఉంది. 

Advertisment
తాజా కథనాలు