Yellamma Movie Hero: ఎల్లమ్మ మూవీ హీరోగా దేవీ శ్రీ ప్రసాద్?

వేణు దర్శకత్వంతో రాబోతున్న ఎల్లమ్మ మూవీకి హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. డీఎస్పీ ఈ మూవీకి రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. దేవీశ్రీ సరసన మహానటి కీర్తీ సురేష్ నటించనున్నట్లు తెలుస్తోంది.

New Update
Yellamma Movie

Yellamma Movie

వేణు(Venu Yellamma) దర్శకత్వంలో వచ్చిన బలగం మూవీ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే తన తర్వాత చిత్రం ఎల్లమ్మ మూవీ(Yellamma movie) కోసం వేణు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను ఎప్పుడో చిత్ర యూనిట్ ప్రకటించినా.. హీరో మాత్రం ఇంకా కన్ఫార్మ్ కాలేదు. ఇది వరకే నాని, నితిన్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి హీరోలను సంప్రదించారు. హీరో నానికి ఎల్లమ్మ కథ నచ్చినా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన తర్వాత చేద్దామని అనడంతో నితిన్ దగ్గరకు కథ వెళ్లింది. కానీ నితిన్ ఇటీవల నటించిన తమ్ముడు మూవీ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఈ సినిమా కథ మళ్లీ వేరే హీరో దగ్గరకు వెళ్లింది.

ఇది కూడా చూడండి: Telusu Kada Movie Twitter review: మూవీ హిట్ తెలుసు కదా.. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో హిట్ కొట్టిన డీజే టిల్లు

రూ.5 కోట్ల రెమ్యూనరేషన్..

తమిళ హీరో కార్తీ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇలా వెళ్లింది. కానీ ఫిక్స్ కాలేదు. అయితే ఇప్పుడు ఎల్లమ్మ మూవీకి హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌‌(devi sri prasad) ఫిక్స్ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పదేళ్ల క్రితమే దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. అయితే ఎల్లమ్మ సినిమాతో దేవీశ్రీ ప్రసాద్ హీరోగా తెరపై కనిపించనున్నారు. బలగం మూవీకి నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు.. ఎల్లమ్మ మూవీకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. దేవీశ్రీకి జోడీగా కీర్తీ సురేష్‌(keerthi-suresh) ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు దేవీశ్రీకి రూ.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Mamitha Baiju: అందంతో మెస్మరైజ్ చేస్తున్న డ్యూడ్ హీరోయిన్.. క్యూట్‌నెస్‌కు పడిపోతున్న కుర్రాళ్లు !

Advertisment
తాజా కథనాలు