/rtv/media/media_files/2025/09/20/og-controversy-2025-09-20-14-13-52.jpg)
OG Controversy
OG Controversy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఓజీ (They Call Him OG)" సినిమా పై అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈ మూవీ నుండి ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు, పాటలు అన్నీ మాస్ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుని సినిమాపై అద్భుతమైన హైప్‌ను కలిగించాయి.
Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?
ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఒక రాజకీయ వ్యాఖ్య హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఈ సినిమాపై ట్విట్టర్ (X) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్
#OG సినిమాకు అధిక టికెట్ ధర ఇచ్చినట్టే ఉల్లి రైతులకు, వరి రైతులకు, మిర్చి రైతులకు కూడా మద్దతు ధర కల్పిస్తున్నట్టు ఒక జీవో ఇవ్వచ్చు కాదా #PawanKalyan ?
— T Chandra Sekhar MLA (@TatiparthiOnX) September 18, 2025
పెయిడ్ ఆర్టిస్టుకు లాభం కోసమే ప్రభుత్వ ఉత్తర్వులు కానీ పేదల కోసం, రైతుల కోసం కాదంటారా?
ఎమ్మెల్యే చంద్రశేఖర్ సంచలన ట్వీట్:
పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక టికెట్ ధరలకు అనుమతి ఇచ్చిన విషయాన్ని ఉద్దేశించి, చంద్రశేఖర్ ట్వీట్‌లో మండిపడ్డారు.
"పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకే ఈ రేట్లు అనుమతిస్తే,
మరి ఈ రాష్ట్రంలోని ఉల్లి, మిర్చి, వరి రైతులకు మద్దతు ధర ఎందుకు ఇవ్వరు?
పేదల కోసం, రైతుల కోసం జీవోలు రావు, కానీ పెయిడ్ ఆర్టిస్టుల మాత్రం లాభం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందా?"
Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?
ఈ వ్యాఖ్యలతో ఆయన పవన్ కళ్యాణ్ పైపాటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కూడా ప్రశ్నలు సంధించారు. సినిమాకు ఇస్తున్న ప్రాధాన్యత పేదల సమస్యలకూ ఇవ్వాలన్నదే ఆయన వ్యాఖ్యల ముఖ్య ఉద్దేశం.
పవన్ కళ్యాణ్ యాక్టర్‌గా ఎంతగానో పాపులర్ అయినప్పటికీ, ఇప్పుడు ఆయన రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేతగా ఉన్నారు. అలాంటి సమయంలో ఆయన నటించిన సినిమాపై ప్రభుత్వ నిర్ణయాలు, వాటికి రాజకీయ నాయకుల స్పందనలు ఎక్కువ చర్చకు కారణమవుతున్నాయి. OG సినిమా కేవలం సినిమా రేంజ్‌ను మించిపోయి, రాజకీయ రంగంలోనూ ప్రభావం చూపుతుండటం గమనార్హం.