/rtv/media/media_files/2025/09/19/og-advance-bookings-2025-09-19-09-33-49.jpg)
OG Advance Bookings
OG Advance Bookings: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న "OG" సినిమాపై అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. సుజీత్(Director Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా, ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25, 2025న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.
It's been More than 18 Hrs Since #TheyCalllHimOG Bookings Opened in Guntur
— Hemanth Kiara (@UrsHemanthKiara) September 19, 2025
Still Not Even Single Full Registered
All 3 Shows are Go Green and available
And they are many seats blocked
Even the Most Hyped Film with Sujeeth 🙏🙏#OGpic.twitter.com/7MWhHhQeFl
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో 'OG' టికెట్ల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తుండటంతో, బుకింగ్స్‌కి మంచి స్పందన వస్తోంది.
గుంటూరులో మొదటి షో – టికెట్లు సొల్డౌట్ (OG Ticket Bookings)
ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని కొన్ని థియేటర్లలో, సెప్టెంబర్ 25 తెల్లవారుజామున 1:00 AM, 1:15 AM షోల టికెట్లు District App, అధికారిక వెబ్‌సైట్ లలో అందుబాటులోకి వచ్చాయి.
టికెట్ల ధరను AP ప్రభుత్వం ఇప్పటికే పెంచేందుకు అనుమతిచ్చిన నేపథ్యంలో, టికెట్ రేటు ₹1000గా నిర్ణయించారు. దానికి ట్యాక్స్‌లు, బుకింగ్ ఛార్జీలు కలిపి ఒక్క టికెట్ ధర ₹1042గా ఉంది.
గుంటూరులో లక్ష్మీపురం మైన్ రోడ్‌లో ఉన్న హాలీవుడ్ బాలీవుడ్ థియేటర్, శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ లో ఈ బెనిఫిట్ షోలు ప్లాన్ చేశారు.
Also Read: Shanmukh Jaswanth: 'ప్రేమకు నమస్కారం' అంటున్న షణ్ముఖ్.. కొత్త సినిమా గ్లింప్స్ అదిరింది బ్రో !
తెలంగాణలో బెనిఫిట్ షోలపై నో క్లారిటీ.. (OG Benefit Shows)
తెలంగాణలో OG ప్రీమియర్ షోలు ఉంటాయా? టికెట్ రేట్లు పెరుగుతాయా?(OG Ticket Prices) అనే విషయంపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. కానీ, గతంలో పుష్ప 2 సినిమాకు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరను ₹800గా అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.
OGకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? లేదా? ఇస్తే పుష్ప 2 కంటే ఎక్కువ ధరను అనుమతిస్తుందా? అనే అంశాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. 'ఫౌజీ' లో మరో స్టార్ హీరో ఎంట్రీ!
ట్రైలర్ వచ్చేస్తోంది! (OG Trailer Update)
OG చిత్ర యూనిట్ ఇప్పటికే అభిమానులకు వరుసగా గుడ్ న్యూస్ ఇస్తోంది. ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 21 ఉదయం 10:08AMకి ట్రైలర్ విడుదల కానుంది అని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, అంతకు ముందే బుకింగ్స్ మొదలయ్యాయనే వార్తతో అభిమానుల్లో మరింత జోష్ పెరిగింది.
Also Read:'ము.. ము.. ముద్దంటే చేదా..?’ ఇంట్రెస్టింగ్ గా 'కిస్' ట్రైలర్..
ఈ భారీ ప్రాజెక్ట్‌లో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, షామ్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం తమన్ అందిస్తుండగా, ఈ ప్రెస్టీజియస్ సినిమాను DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.
ఓజీ సినిమాపై అభిమానుల ఎక్స్‌పెక్టేషన్‌లు రోజురోజుకి పెరుగుతున్నాయి. బుకింగ్స్ మొదలవ్వడం, బెనిఫిట్ షోలు పర్మిషన్ వంటి విషయాలతో ఫ్యాన్స్ అంతా అలర్ట్‌గా ఉన్నారు. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకా క్లారిటీ లేదు, కానీ ఏపీలో మాత్రం ఓజీ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యి రచ్చ లేపుతున్నాయి. సెప్టెంబర్ 25న థియేటర్ల దగ్గర పవన్ ఫీవర్ దద్దరిల్లడం ఖాయం!