Tollywood: టాలీవుడ్‌ కి దిష్టి తగిలిందా..వివాదాల్లో సినీ ప్రముఖులు

టాలీవుడ్‌ సెలబ్రిటీలకు దిష్టి తగిలనట్లు అనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ నటుల కుటుంబాలు వరుస వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు...వారి కుటుంబ తగాదాలు కూడా రచ్చకెక్కుతున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో..

New Update
shoot

Tollywood: టాలీవుడ్‌ సెలబ్రిటీలకు దిష్టి తగిలనట్లు అనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ నటుల కుటుంబాలు వరుస వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు...వారి కుటుంబ తగాదాలు కూడా రచ్చకెక్కుతున్నాయి. గతకొద్ది రోజుల క్రితం తెలంగాణ మంత్రి అక్కినేని నాగార్జున కుటుంబం మీద చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగింది. 

Also Read: Tirumala: తిరుమలలో విషాదం..నడకదారిలో హైదరాబాద్‌ భక్తుడు మృతి!

నాగార్జున కుటుంబానికి చెందిన ఎన్‌ కన్వేషన్ కూల్చి వేయడంతో పాటు నాగచైతన్య- సమంత విడాకుల గురించి మంత్రి చేసిన కామెంట్స్‌ తో నాగార్జున కుటుంబం వార్తల్లోకి ఎక్కింది. ఆ సమయంలో అక్కినేని కుటుంబానికి అండగా ఇండస్ట్రీ మొత్తం నిలిచింది. 

Also Read: అల్లు అర్జున్‌ FIRలో తప్పుడు రిపోర్ట్‌..కోర్టులో నవ్వుకున్న లాయర్లు


ఇక గత వారం రోజులుగా  మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు రచ్చకెక్కాయి. అయితే, అవి పూర్తిగా వారి వ్యక్తిగత విషయాలైనప్పటికీ ఈ కుటుంబంలో జరిగిన గొడవ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 

Also Read: రేవంత్‌-అల్లు అర్జున్‌ పబ్లిసిటీ స్టంట్‌.. కేంద్రమంత్రి షాకింగ్‌ కామెంట్‌

మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు ఉంటే మంచు మనోజ్ మాత్రం ఒంటరిగా పోరాటం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈవిషయం వీరి మధ్య గొడవలకు కారణం అయ్యింది. ఇలా మంచు కుటుంబంలో వివాదం ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ ఒక్కసారిగా ఇండస్ట్రీని షాక్‌ కి గురి చేసింది. పుష్ప-2 సినిమా రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. దీంతో ఆ వివాదం అల్లు అర్జున్ కు చుట్టుకొని ఏకంగా ఆయన్ని జైలు పాలు చేసింది.

Also Read: అల్లు అర్జున్ ఖైదీ నెంబర్ 7697.. జైలులో రాత్రి ఏం చేశాడంటే?

పాన్ ఇండియా స్టార్ హీరోగా జాతీయ అవార్డు అందుకున్నటువంటి ఒక నటుడిని తొక్కిసలాటలో ఓ అభిమాని చనిపోతే.. అరెస్టు చేయడంతో వ్యతిరేకత కనపడుతోంది. అయితే, వీరితో పాటు స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సైతం కొద్దిరోజుల క్రితం వివిధ కారణాలతో వివాదాల్లో చిక్కుకున్నారు.

కాగా, చిన్న చిన్న విషయాలకే టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొందరు స్టార్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమకు దిష్టి తగిలిందని అందరూ అనుకుంటున్నారు. అందుకే సెలబ్రిటీలు వరుసగా ఇలా వివాదాలలో చిక్కుకుంటున్నారని నెట్టింట టాలీవుడ్ హీరోల అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు