అల్లు అర్జున్ ఖైదీ నెంబర్ 7697.. జైలులో రాత్రి ఏం చేశాడంటే?

అల్లు అర్జున్ కు నిన్న సాయంత్రమే బెయిల్ మంజూరు అయినప్పటికీ పలు కారణాల చేత జైల్లోనే ఉండాల్సి వచ్చింది. దీంతో జైలు అధికారులు బన్నీని అండర్ టైల్ ఖైదీగా ( ఖైదీ నెంబర్ 7697) పేరుతో మంజీరా బ్యారక్ లో ఉంచారు.

author-image
By Archana
New Update

Allu Arjun:  టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్టు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిన్న ఉదయం తన నివాసమైన జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ పై  హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని తెలిపింది. 

ఖైదీ నెంబర్ 7697

అయితే అల్లు అర్జున్ కు నిన్న సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ..  సరైన బెయిల్ పత్రాలు అధికారులకు అందకపోవడంతో రాత్రంతా బన్నీ చంచల్గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. దీంతో జైలు అధికారులు బన్నీని అండర్ టైల్ ఖైదీగా ( ఖైదీ నెంబర్ 7697) పేరుతో మంజీరా బ్యారక్ లో ఉంచారు. రాత్రి 10 గంటల వరకు రిషెప్షన్ లో ఉంచి.. ఆ తర్వాత బ్యారక్ లోని క్లాస్-1 రూమ్ కు తరలించినట్లు తెలుస్తోంది.  ఆయనతో పాటు మరి ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నట్లు సమాచారం.  జైలు అధికారులు రాత్రి బన్నీకి భోజనం ఆఫర్ చేసినా తీసుకోలేదట. కొత్త బెడ్ షీట్స్ ఇచ్చినా.. సాధారణ ఖైదీ వలే నేల మీదే పడుకున్నట్లు తెలుస్తోంది. 

జైలు నుంచి విడుదల 

అల్లు అర్జున్ ఈరోజు ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు.హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు ఆయనను వెనుక గేటు నుంచి పంపించారు. అనంతరం బన్నీ జూబ్లీహిల్స్ లోని తన ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ ని చూడగానే కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన భార్య స్నేహ రెడ్డి, పిల్లలు అల్లు అర్జున్ ని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. 

Also Read: CM Chandra babu: అల్లు అరవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు