/rtv/media/media_files/2025/07/18/vishwambhara-storyline-revealed-by-director-vassishta-2025-07-18-12-19-35.jpg)
vishwambhara storyline revealed by director vassishta
చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రం సోషియో-ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా స్టోరీ గురించి దర్శకుడు వశిష్ఠ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మేరకు ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుందో ఆయన తెలిపారు.
విశ్వంభర స్టోరీ గూస్‌బంప్స్
వశిష్ట ఏం చెప్పారంటే.. ‘‘మనకు తెలిసినవి 14 లోకాలు. అందులో కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. అయితే ‘విశ్వంభర’ అనేది ఈ 14 లోకాలకు పైన ఉన్న మరో లోకం. ఈ చిత్రంలో కథానాయిక (త్రిష) ఆ విశ్వంభర లోకానికి చెందినది. ఏదో ఒక కారణం చేత ఆమె భూమి మీదకు వస్తుంది. భూమి మీదకు వచ్చిన హీరోయిన్‌ను తిరిగి విశ్వంభర లోకానికి ఎలా తీసుకెళ్లారు. ఈ క్రమంలో హీరో (చిరంజీవి) ఎలా ప్రయాణించాడు. అక్కడ ఎదురైన సవాళ్లు ఏమిటి? అన్నది ఈ సినిమా ప్రధాన కథాంశం.’’ అని చెప్పుకొచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. దర్శకుడు వశిష్ట అప్డేట్‌తో సినిమా కోసం మరింత ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. దానికి గల కారణాలను ఆయన వివరించారు. ‘విశ్వంభర’ చిత్రం ఆలస్యం కావడానికి ప్రధాన కారణం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు అని దర్శకుడు వశిష్ఠ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో దాదాపు 4676 VFX షాట్‌లు ఉన్నాయని, ఇండియన్ సినిమాలలో ఇంత భారీ స్థాయిలో VFX వర్క్ జరగడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలోని అనేక VFX కంపెనీలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయని, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన దృశ్య అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ సినిమా కోసం భారీ స్థాయిలో.. విభిన్నమైన 13 సెట్‌లు నిర్మించారని, ఒక్కో సెట్ కూడా కథలో ఒక్కో పాత్ర పోషిస్తుందని వశిష్ఠ వివరించారు. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘కీలు గుర్రం’, ఎన్టీఆర్ నటించిన ‘పాతాళభైరవి’ వంటి పాత ఫాంటసీ సినిమాల నుండి తాను ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఒక పాట మినహా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని వెల్లడించారు.