Mechanic Rocky : విశ్వక్ సేన్ కొత్త సినిమా విడుదల వాయిదా

విశ్వక్ సేన్ కొత్త సినిమా 'మెకానిక్ రాకీ' విడుదల వాయిదా పడింది. తొలుత దీపావళి కానుకగా అక్టోబర్ 31 న సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఫైనల్‌‌‌‌‌‌‌‌గా నవంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

vdxv
New Update

Viswak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు 'మెకానికా రాకీ' (Mechanic Rocky) అంటూ రాబోతున్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

Also Read : యాక్షన్ తో అదరగొట్టిన సమంత.. 'సిటాడెల్' ట్రైలర్ చూశారా?

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన  టీజర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 31 రిలీజ్ చేయాలని అనుకున్నారు. రిలీజ్ డేట్ ను అఫీషియల్ గానూ అనౌన్స్ చేశారు. 

Also Read : ప్రతీ సీన్ ఇంటర్వెల్ లా ఉంటుంది.. 'పుష్ప2' పై హైప్ పెంచిన దేవిశ్రీ ప్రసాద్

దీపావళికి కాదు..

కానీ అనివార్య కారణాలతో రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఫైనల్‌‌‌‌‌‌‌‌గా నవంబర్ 22న ఈ  చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సరికొత్త పోస్టర్ తో  ప్రకటించారు. అలాగే ఈ నెల 20న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు తెలియజేశారు. 

Also Read : ఒకే వేదికపై సూర్య, ప్రభాస్, రజినీకాంత్.. ఫ్యాన్స్ కు పండగే

అయితే సినిమా పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ ఏంటో మూవీ టీమ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. SRT ఎంటర్టైనెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. విశ్వక్ సేన్ మెకానిక్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read : అబ్బ అనిపించిన హెబ్బా పటేల్.. కొత్త ఫొటోలు ఏమున్నాయ్ గురూ

#cinema-news #mechanic-rocky #vishwak-sen
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe